కడప జిల్లాలో ఉగ్రవాదుల మకాం

ఇద్దరు తీవ్రవాదులను యాంటీ టెర్రిరిస్టు స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-01 18:28 GMT

కడప జిల్లాలో తమిళనాడు తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (aunty terrorist squad ATS) మంగళవారం సాయంత్రం అరెస్టు చేసింది. 

తమిళనాడు రాష్ట్రం నాగూర్ ప్రాంతానికి చెందిన అబూబకర్ సిద్దిక్, మేళ్లఫలయం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అలీ అలియాస్ యూనస్ దాదాపు 30 ఏళ్లుగా పరారీలో ఉన్నట్టు తెలిసింది. బాంబు దాడుల్లో వారు నిందితులు.
రాయచోటి పట్టణంలో వారిద్దరూ కొన్నేళ్లుగా ఆశ్రయం తీసుకుంటున్నట్లు తెలిసింది. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సామాన్యులతో కలిసిపోయి, చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి కదలికలపై పక్కా సమాచారంతో తమిళనాడు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ దాది చేసి, అదుపులోకి తీసుకుంది.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్న వారిద్దరూ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో తమిళనాడు నుంచి ఏ టి ఎస్ పోలీస్ జనం మంగళవారం ఉదయం రాయచోటి పట్టణానికి చేరుకుంది. ఇక్కడ పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు వారి సహకారంతో జనం మధ్య సాధారణ జీవనాన్ని సాగిస్తూ స్లీపర్ షెల్ఫ్ అబూబకర్ సిద్దిక్, మొహమ్మద్ అలీ అలియాస్ యూనస్ ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య వారిద్దరిని తమిళనాడుకు తరలించినట్లు తెలుస్తోంది.
సాధారణ వ్యాపారాలు చేసుకుంటూ జనజీవనంలో ఉన్నారని ఏ టి ఎస్ దళానికి ఉప్పందింది.
తమిళనాడు నుంచి వచ్చిన ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు ఆ ఇద్దరు తీవ్రవాదులను అదుపులోకి తీసుకుంది. దీంతో స్థానికులే కాదు. పోలీసులు కూడా అవాక్కయ్యారు. అయితే, రాయచోటి పట్టణ పోలీసుల సహకారంతోనే అనేక బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను
"ఇన్నాళ్లుగా తమ మధ్య సాధారణ వ్యక్తులు మాదిరి సంచరించింది ఉగ్రవాదుల అని రాయచోటి పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు"
1995 నుంచి పరారీ?
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులకు పెద్ద నేరచరిత్ర ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. స్లీపర్ సెల్స్ గా మారిన తీవ్రవాదులు అబూబకర్ సిద్దిక్, ఆ మొహమ్మద్ అలీ కి అనేక బాంబు పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. అందులో ప్రధానంగా,
ఉగ్ర కలాపాల్లో కీలకంగా వ్యవహరించిన వారిలో అబూ బకర్ సిద్ధికి పెద్ద చరిత్ర ఉన్నట్లు పోలీస్ రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం
1995 నుంచి పరారీలో ఉన్న అబూబక్కర్ సిద్దీక్ అనేక బాంబు దాడుల ఘటనల్లో నిందితుడని తెలిసింది. అందులో..
1995: చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు దాడి.
1995: నాగూరులో పార్శిల్ బాంబు పేలుడు (తంగం మరణించారు).
1999: చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగానే కాకుండా, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబులు ఉంచిన ఘటనలో ఈయన ప్రధాన సూత్రధారి అని తెలిసింది.
2011: మధురైలో ఎల్.కె.అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు
2012: వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య
2013: బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితుడు.
అతనితో పాటు మరో ఉగ్రవాది మొహమ్మద్ అలీ కూడా 26 ఏళ్లుగా పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు అమర్చిన కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతటి ప్రమాదకరమైన వ్యక్తులు సాధారణ జనంతో కలిసిపోయారు. రాయచోటి పట్టణంలో ఆశ్రయం తీసుకుంటూ, చాపకిందనీరులా ఉగ్రకలాపాలు సాగించినట్లు భావిస్తున్నారు. వీరి అరెస్టుతో రాయచోటి పట్టణంలో ఆ ఇద్దరు ఆశ్రయం తీసుకున్న ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.


Similar News