ఇద్దరు దోస్తులయ్యారు..ఎలా అంటే

బిల్‌గేట్స్‌ను కలిసే అవకాశం వచ్చినా, ఆయనతో కలిసి కాఫీ తాగే చాన్స్‌ దొరికినా అది మహా భాగ్యంగా భావిస్తారు. అంతకు మించి చంద్రబాబుకు దొరికింది.;

Update: 2025-01-25 12:32 GMT

టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఇండియాలోనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని ఓ మలుపు తిప్పిన ప్రపంచ ప్రఖ్యాత బిల్‌ గేట్స్‌ దోస్తులయ్యారు. ఇద్దరు కలిసింది చాలా తక్కువ సార్లే అయినా.. టెక్నాలజీకి కంటే మించి ఇద్దరి మధ్య బోలెడు బంధం ఏర్పడింది. అందుకు గుర్తుగానే సీఎం చంద్రబాబుకు ఓ అరుదైన బహుమతిని బిల్‌ గేట్స్‌ అందజేశారు. అపర కుబేరుడు బిల్‌ గేట్స్‌ స్వయంగా రచించిన పుస్తకం ఇంకా మార్కెట్‌లోకి రాక ముందే ఆ పుస్తకపు కాపీని సీఎం చంద్రబాబుకు గిఫ్ట్‌గా అందించారు. నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొంటూ ఆ పుస్తకం మీద తన స్వ అక్షరాలతో రాసి తన సంతకం చేసిన పుస్తకపు కాపీని చంద్రబాబుకు అందించడం విశేషం. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Delete Edit

సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొలి సారి బిల్‌ గేట్స్‌ను కలిసే ప్రయత్నం చేశారు. అందుకు బిల్‌గేట్స్‌ కార్యాలయం నుంచి తొలుత నో అని సమాధానం వచ్చినా.. చంద్రబాబు చొరవతో బిల్‌గేట్స్‌ను కలిసే అవకాశం దొరికింది. అదీ కూడా ఓ కాక్‌ టెయిల్‌ మీటింగ్‌ ఉంది.. దానికి హాజరైతే బిల్‌గేట్స్‌ను కలిసే అవకాశం ఉంటుందని బిల్‌ గేట్స్‌ కార్యాలయం నుంచి చంద్రబాబుకు సమాధానం వచ్చింది. బిల్‌ గేట్స్‌ను కలవడమే చాలనుకున్న చంద్రబాబుకు ఆ సమాధానం ఎంతో సంతోషం కలిగించింది. అలా బిల్‌గేట్స్‌ను కలిసే అవకాశం దక్కించుకున్న చంద్రబాబుకు బిల్‌ గేట్స్‌తో సమావేశానికి 10 నిముషాలే సమయం ఇచ్చారు. పది నిముషాలానే అని నిరాశపడకుండా అదే ఇదే సదవకాశంగా తీసుకున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మీద తనకున్న ప్రేమను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను, డెవలప్‌మెంట్స్‌తో కూడిన తన విజన్‌ను బిల్‌గేట్స్‌ ముందు ఆవిష్కరించారు. చంద్రబాబు ప్రెజెంటేషన్‌కు ముగ్ధుడైన బిల్‌ గేట్స్‌ చంద్రబాబుకి ఇచ్చిన 10 నిముషాల సమయాన్ని మరిచి పోయారు. అలా పది నిముషాల సమావేశం కాస్తా 45 నిముషాల సుదీర్ఘ సమావేశానికి దారి తీసింది. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ సంస్థను ఏర్పాటు చేయాలనే చంద్రబాబు ఆహ్వానం నచ్చిన బిల్‌గేట్స్‌ హైదరాబాద్‌లో తన మైక్రోసాఫ్ట్‌ సంస్థను ఎస్టాబ్లిష్‌ చేసేందుకు మొగ్గు చూపారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ సంస్థ అలా వచ్చిందంటూ దాని వెనుకున్న నేపథ్యాన్ని ఇటీవల దావోస్‌ పర్యటనలో స్వయంగా చంద్రబాబే వివరించారు.

Delete Edit

ఆ తర్వాత వారిద్ధరు కలుసుకోలేక పోయినా.. వారిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. చంద్రబాబు ఆహ్వానం మేరకు 1998లో బిల్‌ గేట్స్‌ హైదరాబాద్‌ను సందర్శించారు. తర్వాత చాలా గ్యాప్‌ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాడు 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడి పోవడం, 2014లో రాష్ట్ర విభజన జరగడం, తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా వేరు కావడం వంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2017లో మరో సారి బిల్‌ గేట్స్‌ను కలిశారు. తర్వాత 2019లో అధికారం కోల్పోవడంతో మరో కొన్ని సంవత్సరాలు బిల్‌ గేట్స్‌ను కలిందుకు అవకాశం లేకుండా పోయింది. 2024లో అధికారంలోకి వచ్చారు. వరల్డ్‌ ఎకనామిక ఫోరమ్‌ సమ్మిట్‌ సందర్భంగా వారం రోజుల క్రితం దావోస్‌ పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బిల్‌ గేట్స్‌ను మరో సారి కలిసే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా వారిద్దరు పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్‌ గేట్స్‌ తాను స్వయంగా రచించిన ‘సోర్స్‌ కోడ్‌ మై బిగినింగ్స్‌’ పుస్తకాన్ని చంద్రబాబుకు గిఫ్ట్‌గా అందించారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. సోర్స్ కోడ్ పేరుతో నా స్సేహితుడు బిల్ గేట్స్ పుస్తకం విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తక కాపీని నాకు బహూకరించినందుకు ధన్యవాదాలు. థాంక్స్ మై ఫ్రెండ్ బిల్ గేట్స్ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు

Tags:    

Similar News