ఆ మూడు పార్లమెంట్‌లకు టీడీపీ అభ్యర్థులు వీరే

ఒంగోలు, నెల్లూరు, నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. టీడీపీ ప్రకటన వెలువడటమే తరువాయి.

Update: 2024-02-14 06:31 GMT
Magunta Srinivasulureddy, MP, Vemireddy Prabhakarreddy Rajyasabha MP, Aadala

వైఎస్సార్‌సీపీ నుంచి బయకు వెళ్లిన, వెళ్లాలనుకుంటున్న వారు తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు, ఒంగోలు, నర్సరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థులుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు కలిసారు. మొదట వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బీజేపీలో చేరి నెల్లూరు ఎంపీగా టీడీపీ అలయెన్స్‌తో పోటీలో ఉండాలనుకున్నారు. బీజేపీని ఆంధ్ర ప్రజలు ఆదరిస్తారో లేదోననే ఆలోచనతో అడుగు వెనక్కు వేసిన వేమిరెడ్డి టీడీపీవైపే మొగ్గు చూపారు.

హైదరాబాద్‌లోని వేమిరెడ్డి ఇంట్లో సమావేశం
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని వేమిరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. వ్యాపారాల విషయం మాట్లాడుకున్న తరువాత రాజకీయాల గురించి ^è ర్చించారు. రాజకీయ భవిష్యత్‌ బాగుంటేనే వ్యాపారాలు కూడా బాగుంటాయనే ఆలోచనకు వచ్చారు.
నేను పార్టీ మారను
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్టీ మారనని మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డిలకు చెప్పారు. ఇప్పటికే నేను టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చానని, తిరిగి మళ్లీ టీడీపీకి వెళ్లడం అంటే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని, ప్రతిసారీ పార్టీలు మారతాడనే చెడ్డ పేరు వస్తుందని, అందువల్ల నేను పార్టీ మారనని చెప్పారు. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి చంద్రబాబు నుంచి బీఫారం తీసుకున్నారు. ఆ తరువాత వెను వెంటనే వైఎస్సార్‌సీపీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. ఒక విధంగా టీడీపీని మోసం చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలాగే పార్టీ మారితే బాగుండదనేది మిగిలిన ఇద్దరికీ చెప్పారు.
ఒంగోలు నుంచే మాగుంట
మాగుంట శ్రీనివాసులురెడ్డి మాత్రం ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్‌సీపీ వారు టిక్కెట్‌ ఇచ్చేది లేదని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మాగుంట శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిగా ఉంటారా? ఆయన కుమారుడు రాఘవరెడ్డి రంగంలోకి దిగుతారా అనేది ఇంకా తేలలేదు. కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. అందువల్ల రాఘవరెడ్డి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నెల్లూరు టీడీపీ ఎంపీగా వేమిరెడ్డి
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వేమిరెడ్డి, మాగుంట, ఆదాల కలిసి చర్చించుకున్న సమయంలో ఈ నిర్ణయానికి వచ్చారు. వైఎస్సార్‌సీపీ వారు నెల్లూరు ఎంపీగా టిక్కెట్‌ ఇస్తామని చెప్పినా తాను అనుకున్న నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో స్వేచ్ఛ ఇవ్వలేదు. దీంతో దిక్కుతోచని వేమిరెడ్డి మొదట బీజేపీ అనుకుని, ఆ తరువాత టీడీపీని ఎంచుకున్నారు.
నర్సరావుపేట టీడీపీ ఎంపీగా లావు
వైఎస్సార్‌సీపీ నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున తిరిగి నర్సరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం. నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ను నర్సరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ అనౌన్స్‌ చేసింది. ఐదేళ్లు ఎంపీగా ఉన్న లావు తప్పకుండా నేను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. అనిల్‌కుమార్‌కు ఈ నియోజకవర్గం పూర్తిగా కొత్తకావడం విశేషం.
చంద్రబాబుకు టచ్‌లో ఈ నేతలు
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరి పేర్లను పార్లమెంట్‌ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    

Similar News