Big Breaking | చిత్తూరులో పట్టపగలే దొంగల స్వైరవిహారం
ఆ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. ఉగ్రవాదులను వేటను తలపించిన సీన్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.;
చిత్తూరు నగరంలోని లక్ష్మి సినిమా హాల్ సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు తుపాకులతో మంగళవారం తెల్లవారుజామున స్వైరవిహారం చేశారు. ఇంటి యజమాని అప్రమత్తతో పోలీసులకు సమాచారం అందింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా ఎస్పీ మణికంఠ చందోలు సాయుధ సిబ్బందితో రంగంలోకి దిగారు.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసులు ఒకపక్క. అధునాతన ఆయుధాలతో ఇంటిని చుట్టుముట్టిన మరో పోలీసు బృందాలు. ఉగ్రవాదులను వేటాడిన రీతిలో పోలీసులు చేతిలో తుపాకుల సిద్ధంగా ఉంచుకొని దొంగలను పట్టుకుని ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్న దోపిడి దొంగల్లో ముగ్గురిని పట్టుకున్నారు. ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియని స్థితిలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సుక్షిత కమాండవులు నిచ్చెనల సాయంతో ఇంటి పైకి ఎక్కారు. చేతిలో పిస్టళ్ళు, మరోపక్క సెల్ఫ్ లోడెడ్ రైఫిల్స్ ( self loaded trifles slr's) ఏం చేసినా యువ పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.