రాజ్యసభకు ఆ ముగ్గురు
రాజ్యసభ అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది. దీంతో వారు సీఎంను అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.;
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న స్థానాలు భర్తీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించిది. వీరిని ఏపీ శాసన సభ్యులు ఎన్నుకుంటారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డిలు అభ్యర్థులుగా వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈనెల 15 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఈనెల 24తో ఎన్నికల కార్యక్రమం ముగుస్తుంది.
ఏప్రిల్ నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ మూడు స్థానాలను తన ఖాతాలో పడేలా జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు గెలడానికి బలం ఉండటంతో ముగ్గుర్ని బరిలోకి దించుతున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, కడప జిల్లాకు చెందిన మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయ లెక్కలు వేసుకున్న తర్వాత సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి అభ్యర్థిత్వానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి పేర్లను అధికారికంగా ప్రకటించింది.
వైఎస్సార్సీసీ ఊహించినట్లుగానే వైవీసుబ్బారెడ్డి, గొల్ల బాబూరావులను రాజ్యసభకు అభ్యర్థులుగా ఖరారు చేసింది.రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి 2014లో టీడీపీలో గెలిచి ఆ తరువాత 2019లో వైఎస్సార్‌సీపీలో చేరి రాజంపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన సోదరుడు మేడా రఘునాధరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈయనకు రాజంపేట ఎంపీ టిక్కెట్ ఇస్తారనే టాక్ వచ్చింది. అయితే అనూహ్యంగా రాజ్యసభ ఇచ్చారు.
ఇకపై రాజ్యసబలో వైవీ
మేడా రఘునాథరెడ్డి ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏకంగా ఆయనను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈయనను రాజ్యసభకు పంపిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అనూహ్యంగా రాజ్యసభకు వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది. సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అసంతృప్తితో నైనా ఎమ్మెల్యేలు ఆమోదించక తప్పదు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకున్న తర్వాతే సీఎం జగన్ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, , ఆంధ్రా ప్రాంతం నుంచి టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. గొల్ల బాబురావు ఎస్సీ సామాజికవర్గం అయితే, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డిలు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు.
ప్రస్తుతం కొందరు శాసనసభ్యులు అనర్హతకు గురయ్యారు. అనర్హులైన వారికి ఓటు హక్కు ఉండదు. కొందరు వైఎస్సార్‌సీపీలో చేరగా వైఎస్సార్‌సీపీ నుంచి కొందరు టీడీపీలో చేరారు. ఆయా పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. శుక్రవారం ఉదయానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనర్హులు అయ్యారనేది తేలుతుంది. దానిని బట్టి ఎన్ని ఓట్లు రాజ్యసభకు ఉంటాయనేది ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నేత, నెల్లూరు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. రాజ్యసభ ఎన్నికల ముగిసిన వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించింది వైసీపీ. వైసీపీకి పూర్తి బలం ఉండటంతో వారి ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా ఎంపీ స్థానం చేజారిపోయే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.