రాజకీయ నాయకులపై చెప్పు విసరడం భావప్రకటనా స్వేచ్ఛేనా సవాంగ్‌?

మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చిక్కుల్లో పడ్డారు. చెప్పు విసరడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా రాదో చెప్పాలనే దానికి సవాంగ్ ఏమి చెబుతారు

Update: 2024-03-31 11:26 GMT
ప్రతికాత్మక చిత్రం

రాజకీయ నాయకులపై చెప్పులు విసరడం తప్పు కాదా? అది భావప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుందా? అంటే అవుననే అంటున్నారు మాజీ డీజీపీ గౌతం సవాంగ్‌. ఇప్పుడు ఆయన వ్యాఖ్య నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి అలా ఎందుకు అన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అధికారి గతంలో కొందరు ఈపని చేసినప్పుడు అది కూడా ఓ తరహా నిరసనేనన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే...

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌ను లక్ష్యంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరారు. అది అన్ని పత్రికల్లోనూ రిపోర్ట్‌ అయింది. ఈ నేపథ్యంలో మాజీ డీజీపీ డీజీపీ గౌతం సవాంగ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
జగన్‌ ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని నిలిపివేసినందుకు నిరసనగా గతంలో రైతులు ఆందోళన చేశారు. ఆసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరికొందరు నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు. ఆ సమయంలో కొందరు చంద్రబాబు వాహనంపై చెప్పులు, రాళ్లు విసిరారు. మరికొందరు కర్రలు కూడా విసిరారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా పరిగణించి, దుండగులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌... అది దాడి కాదని, వారి భావప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, చెప్పులు విసరడం కూడా ఒక విధమైన భావప్రకటన స్వేచ్ఛే అన్నట్టు గతంలో మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.


Tags:    

Similar News