AIYF National Conference | తిరుపతిలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు
ఈ ఏడాది మే నెలలో నిర్వహించే మహాసభల లోగోను సీపీఐ కార్యదర్శి ఆవిష్కరించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-28 11:47 GMT
నిరుద్యోగులకు ఉద్యోగాలు, యువత ఉపాధి కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ డిమాండ్ చేశారు. సామాజహిత కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అఖిల భారత యువజన సమాఖ్య - ఏఐవైఎఫ్ (All India Youth Federetion - AIYF) 17వ జాతీయ మహాసభలు ఈ ఏడాది మే నెల 15వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్నారు.
తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఐఏవైఎఫ్ మహాసభల సన్నాహ లోగోను సీపీఐ (Communist Party Of India -CPI) రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
"మతోన్మాద శక్తుల కుయుక్తులను ఎదుర్కొనేందుకు తిరుపతి వేదికగా కార్యాచరణ సిద్ధం చేస్తాం" అని రామకృష్ణ తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే,
"చదువుకి తగిన ఉద్యోగ అవకాశాలు దక్కడం లేన్నారు. దీంతో నిరుద్యోగ యువత సంఖ్య పెరుగుతన్నా, పాలకులకు ఇది పట్టడం లేదు" అని విమర్శించారు. దేశ సంపదను అదాని, అంబానీలకు కట్టబెట్టడంలో ఉన్న శ్రద్ధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ దేశ ప్రజల సమస్యలు అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారని రామకృష్ణ ఆరోపించారు.
కులగణన పేరిట చిచ్చు
దేశంలో కులగణన పేరుతో మతాల మధ్య గొడవలు సృష్టించి నేటి పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఏపాత్ర లేని ఆర్ఎస్ఎస్ ((RSS) వాదులు యువతకు ఆదర్శవంతులు అనే విధంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చిత్ర పరిశ్రమను కాషాయమూకలు చేతుల్లో తీసుకుని చావా వంటి చిత్రాలతొ ఛత్రపతి శివాజీ, ఔరంగ జేబు వంటి చరిత్రలను తప్పుగా చిత్రీకరించి, దేశ ప్రజల్లో ముస్లింలను శత్రువులుగా చూపించే ప్రయత్నం చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల్లో విద్వేషాలను నింపుతూ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించకుండా వారి దృష్టినీ మళ్లించి మరో వైపు దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
యువత సమస్యలపై కార్యాచరణ
తిరుపతిలో మే 15,16,17,18 నిర్వహించే ఎఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో ఈ దేశంలో యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కార్యచరణ రూపొందిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య పట్టణ కార్యదర్శి జే. విశ్వనాథ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం రామకృష్ణ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.