BREAKING | తిరుపతి : యూనియన్ బ్యాంకులో ఎంతకొల్లగొట్టారంటే...
బ్యాంకులోని ప్రజల నగలను కొల్లగొట్టారు రూ. కోట్లు దోపిడీ చేశారు. దీంతో ఖాతాదారులు కలవరం చెందుతున్నారు పోలీసుల దర్యాప్తులో తెలాల్సిందే.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-23 00:40 GMT
చిత్తూరు జిల్లా సత్యవేడు (Satyavedu ) నియోజకవర్గంలోని నాగలాపురం యూనియన్ బ్యాంకు ఇఫ్ ఇండియా ( Union Bank of India ) శాఖలో వెలుగు చూసిన ఘటనతో తీవ్రం కలకలం చెలరేగింది. బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. నాగలాపురం ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ, "కేసు నమోదు చేశాం" అని సునీల్ ధృవీకరించారు. "బ్యాంకు అధికారుల చేతివాటం వెనుక ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది" అనే విషయంపై దర్యాప్తు సాగుతోంది" అని ఆయన స్పష్టం చేశారు." ఇంకా విషయాలు వెలుగులోకి తీసుకుని రావడానికి సత్యవేడు సీఐ మురళీ దర్యాప్తు సాగిస్తున్నారు" అని ఆయన చెప్పారు.
ఈ సంఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని వారు ఆందోళనకు గురవుతున్నారు. తమ నగలు భద్రంగా ఉన్నాయా అని కలవరానికి గురవుతున్నారు.
తిరుపతి జిల్లా నాగలాపురం (Nagalapuram ) యూనియన్ బ్యాంకులో వారం కిందట ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంకు జోనల్ మేనేజర్ బ్రహ్మయ్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. శుక్రవారం కేసు నమోదు చేసిన తీరు ద్వారా బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఎలా బయటికి వచ్చింది...
నాగలాపురం బ్యాంకులో కూడా ఖాతాదారులు తమ అవసరాల కోసం నగలు కుదవపెట్టి, రుణం తీసుకున్నారు. ఇది సాధారణంగా అన్ని బ్యాంకుల్లో జరిగేదే. నాగలాపురం బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ భారీగానే దోపిడీకి తెరతీశారు. ఈ వ్యవహారం వారం కిందట వెలుగు చేసినట్లు చెబుతున్నారు. బ్యాంకు ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడం వల్ల అధికారులు, పోలీసులు గోప్యంగా ఉంచారు. విషయంలోకి వస్తే..
నాగలాపురం ఇండియన్ బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలు విడిపించుకునేందుకు ఓ ఖాతాదారుడు వచ్చారు. ఆ నగలపై అదనంగా రుణం ఉన్న విషయం బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో అసలు ఖాతాదారులే కాకుండా, నకిలీ ఖాతాదారులతో అవే నగలు కుదువ పెట్టించడం ద్వారా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ వ్యవహారం వెలుగు చూసింది.
బ్యాంకులో ఏమి జరిగింది?
ఇండియన్ బ్యాంకు లాకర్ లోని 37 సంచుల్లో (చిన్నవి) ఉన్న నగలు బయటికి తీసుకుని వెళ్లేవాడని తెలిసింది. వాటిని తన స్నేహితులకు అప్పగించి, వారి ద్వారా అదే బ్యాంకులో తాకట్టు పెట్టించేవారు. ఆ విధంగా మొదటిసారి 1.31 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. మళ్లీ రెండోసారి 30 సంచుల్లోని నగలు తీసుకుని వెళ్లడం ద్వారా మళ్లీ వాటినే కుదువ పెట్టించి, 1.04 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అసలు జరిగిన విషయం ఇది.
ఆ తరువాత...
బ్యాంకు ఖాతాదారుడు, మేనేజర్ ఫిర్యాదుతో తిరుపతి యూనియన్ బ్యాంకు ఇఫ్ ఇండియా జోనల్ మేనేజర్ బ్రహ్మయ్య స్పందించారు. బ్యాంకులో నగదు, తనఖాలోని నగల ఆడిటింగ్ కు ఆదేశాలు జారీ చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారం నుంచి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా గోప్యంగా ఉంచారు. జోనల్ మేనేజర్ బ్రహ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం" అని నాగలాపురం ఎస్ఐ సునీల్ కూడా స్పష్టం చేశారు.
నేరం అంగీకరించారా?
తిరుపతి జోనల్ ఆఫీస్ నుంచి అధికారులు వచ్చారు. వారి వద్ద "నాగలాపురం యూనియన్ బ్యాంకు ఇఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ స్వచ్ఛందంగానే తాను చేసిన తప్పు అంగీకరించారు" అని ఎస్ఐ సునీల్ చెబుతున్నారు. కాగా, బ్యాంకులో ఆడిటింగ్ నిర్వహించిన అధికారులు ఏ మేరకు వచ్చిన ఆరోపణలపై విచారణ సాగించారు. ఆధారాలు లభించిన నేపథ్యంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు యూనియన్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సూర్య తేజ, మేనేజరు రాజ్ కుమార్ పై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగలాపురం ఎస్ఐ వెల్లడించారు.