TTD | 29 మంది హిందూయేతర ఉద్యోగులను సాగనంపుతాం..

వీఆర్ఎస్ కుఅంగీకరించకుంటే, మళ్లీ చర్చించాలని టీటీడీ బోర్డు మీట్ లో నిర్ణయించారు. తిరుమలలో బ్రాండెడ్ హోటళ్లను అనుమతించాలని ఈఓ శ్యామలరావు వెల్లడించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-20 12:08 GMT
తిరుమలలో చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్

టీటీడీలో పనిచేస్తున్న 29 మంది అన్యమత ఉద్యోగులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని తీర్మానించినట్లు ఈఓ శ్యామలరావు చెప్పారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించే వారికి అదనంగా రూ. 5 లక్షలు చెల్లించడానికి కూడా నిర్ణయించామని చెప్పారు. దీనికి ఆ సిబ్బంది అంగీకరించకుంటే, రానున్న బోర్డు మీట్ లో ఏమి చేయాలనే నిర్ణయిస్తామన్నారు. ఈ విషయంలో సీఎం ఎన్. చంద్రబాబు నుంచి అందే ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.

తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను బోర్డు సభ్యులు, అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరితో కలిసి టీటీడీ ఈఓ శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. 

గంటలో దర్శనం చర్చల్లోనే..
శ్రీవారి దర్శనానికి భక్తులు రోజుల తరబడి నిరీక్షించకుండా, గంటలోపు దర్శనం చేయించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence AI ) ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు గతంలో ప్రకటించారు. ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.
టీటీడీలో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ పై గూగుల్ (Google ), టిసిఎస్ (TCS )సంస్థలు కసరత్తు చేస్తున్నాయని ఈఓ వెల్లడించారు.

తీర్మానాలు ఇవి.
1. తిరుమల భద్రత : తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ వాడాల‌ని నిర్ణ‌యం. దీనిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆధికారుల‌కు ఆదేశం.
2. తిరుమ‌ల‌ : తిరుమలలో గతంలో బిగ్ , జనతా క్యాంటీన్లకు ఆదాయం ప్రాతిపదికన టెండర్లు పిలిచారు. ఆదాయం అనేది టీటీడీ ప్రాధాన్యత కాదు
భక్తులకు నాణ్యమైన, సరసమైన ఆహారం విక్రయించే బ్రాండెడ్ సంస్థలకు టెండర్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని నిర్ణయం.
3. తిరుమలలో పచ్చదనం: సీఎం ఎన్.చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్నిఅట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యం. ప్ర‌భుత్వ ఆమోదం వ‌చ్చాక ద‌శ‌ల‌వారీగా 2025-26 సంవ‌త్స‌రంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవ‌త్స‌రంలో రూ.1.13కోట్లు, 2027-28 సంవ‌త్స‌రానికి రూ.1.13కోట్లు ప్ర‌భుత్వ అట‌వీశాఖ‌కు విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం.
4. ఆలయాల అభివృద్ధి :తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యం.
5. తిరుమ‌ల‌: విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్ద‌రు దాత‌లు స్పందించ‌లేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్ల‌ను టీటీడీనే మార్పు చేయాల‌ని నిర్ణ‌యం. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.
6. స్విమ్స్ : రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానికంగా ఉంటూ ఎంద‌రో పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్ల‌తో పాటు అద‌నంగా మ‌రో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం. విశ్రాంత ఈఓ ఐవి సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మేరకు వివిధ విభాగాల్లో 597 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం . శ్రీవారి వైద్యసేవ ద్వారా ఆసక్తి ఉన్న వలంటీర్స్ ద్వారా స్విమ్స్ లో సేవలు ప్రారంభించాలని నిర్ణయం
7. ఆధ్యాత్మిక వాతావరణం: తిరుమల గిరుల్లో ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ను భ‌క్తులు విశేష సంఖ్య‌లో సంద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ‌ ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాలను మ‌రింత పెంచేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని నిర్ణ‌యం.
8. తిరుమలలో మఠాల ఆక్రమణలపై పరిశీలన జరుగుతోంది. నిభందనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
9. టీటీడీలో ఉద్యోగులకు పదోన్నతుల అమలుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల తలెత్తిన సమస్యలు త్వరలో పరిష్కరించి పదోన్నతులు
10. తులాభారం వివాదంపై విజిలెన్స్ విచారణ మొదలైంది. తప్పు చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం
11. గోశాలలో గోవుల ఆరోగ్య రక్షఫై చర్యలు చేపట్టాం. త్వరలో సత్ఫలితాలు ఇస్తాయి. అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వివరించారు.
12. గోవింద నామాలను వక్రీకరిస్తూ తమిళ సినిమా డిడి నెక్స్ట్ లెవల్ సాంగ్ రూపొందించడంపై లీగల్ నోటీసులు జారీచేయాలని నిర్ణయం
రాజధానిలో...
అమరావతి : రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండ‌లం అనంత‌వ‌రంలోని టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం.TTD, Tirumala, Board Meet, TTD Chairman BR. Naidu

Similar News