వైఎస్సార్‌సీపీ తెరపై రెండు కొత్త ముఖాలు
పొన్నూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు కొత్త ముఖాలు వచ్చాయి. ఒంగోలు, గుంటూరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న వారు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కావడం విశేషం.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-02-29 02:13 GMT
వైఎస్సార్‌సీపీ ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలను కొత్తగా బుధవారం రాత్రి ప్రకటించింది. ఇకపై మార్పులు ఉండబోవంటూ ప్రకటించిన 36 గంటలలోపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం విశేషం.
కిలారు రోశయ్యకు గుంటూరు పార్లమెంట్..
గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరును మొదట ప్రతిపాదించారు. ఈయన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు. ఎందుకనో ఆయన ఆ నియోజకవర్గానికి సెట్ కాలేక హైదరాబాద్ Ðð ళ్లిపోయారు. అయితే కొత్తగా గుంటూరు ఎంపీ స్థానానికి పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను అనౌన్స్ చేశారు. ఈయన ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడం విశేషం. కిలారు రోశయ్యకు రాజకీయంగా మంచిపేరు ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రపై పోటీ చేసి గెలుపొందటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది.
చెవిరెడ్డికి ఒంగోలు ఓకే..
ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బుధవారం ఆయన ప్రకటించారు. దీంతో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ౖÐð స్సార్‌సీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. తనకు టిక్కెట్ కావాలని మాగుంట ఎంతో ప్రయత్నించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు నా నియోకవర్గం నేను చూసుకుంటాననే పరిస్థితికి బాలినేని వచ్చారు. దీంతో చేసేది లేక మాగుంట మిన్నకున్నారు. విధిలేని పరిస్థితుల్లో మాగుంట తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమారుడు రాఘవరెడ్డికి టిక్కెట్ ఇచ్చేలా టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు బుధవారం తాను వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నానని, తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తాడని ప్రకటించారు. అయితే ఏపార్టీ నుంచి అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. టీడీపీ నుంచే పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో టీడీపీలో చేరుతున్నారు.
కనిగిరి నుంచి కందుకూరుకు మధుసూదన్ మార్పు
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి ఇటీవల ఆది శంకర కాలేజీ విద్యాసంస్థల అధినేత వంకి పెంచలయ్య కుమార్తె అరవిందను అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు జిల్లా గూడూరులో విద్యాసంస్థలు నెలకొల్పిన పెంచలయ్య తన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని కోరడంతో జగన్ ముందుగా ఓకే చెప్పారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు కానీ కనిగిరి ఎమ్మెల్యే బూర్రా మదుసూదన్ యాదవ్‌ను కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో ఒకసారి తనకు కనిగిరి నియోజకవర్గమే కావాలని అడిగినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. మొదటిసారిగా యాదవ సామాజిక వర్గం నుంచి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె...
జీడీ నెల్లూరు అభ్యర్థిగా కల్లత్తూర్ కృపాలక్ష్మిని ఎమ్మెల్యేగా సీఎం ప్రకటించారు. ఈమె జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి కుమార్తె కావడం విశేషం. ఇటీవలి వరకు నారాయణస్వామి కుమార్తెకు టిక్కెట్ ఇస్తారనే ప్రచారం సాగింది. దానిని నిజం చేస్తూ కృష్లాక్ష్మిని ఎన్నికల రంగంలోకి దించారు నారాయణస్వామి. ముఖ్యమంత్రి కూడా ఇందుకు సమ్మతిస్తూ ఆమె పేరును బుధవారం రాత్రి ప్రకటించారు.
పొన్నూరులో మంత్రి అంబటి సోదరుడు..
పొన్నూరు అసెంబ్లీ నుంచి అంబటి మురళిని సీఎం జగన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన అంబటి రాంబాబు సోదరుడు. ఎన్జీవో సెక్టారులో మంచిపేరు సంపాదించారు. భజరంగ్ ఫౌండేషన్ కూడా నడుపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.