కాకినాడ జేఎన్టీయూ వీసీగా వరంగల్ నిట్ ప్రొఫెసర్

ఆంధ్రప్రదేశ్ లోని ఆరు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.;

Update: 2025-02-18 12:52 GMT
Andhra university Campus
ఆంధ్రప్రదేశ్ లోని ఆరు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వివిధ ప్రాంతాలలో పని చేస్తున్న వారిని రాష్ట్రంలోని యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించారు.
ఆంధ్రా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ జి.పి. రాజశేఖర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గణితశాస్త్ర ఆచార్యునిగా చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్‌ సి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌ను నియమించారు. ప్రస్తుతం ప్రసాద్‌ వరంగల్ నిట్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్‌గా పి.ప్రకాశ్‌బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్‌సీయూ, స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌సైన్సెస్‌లో బయో టెక్నాలజీలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరంతా మూడేళ్లపాటు ఆయా వర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు.
రాయలసీమ వర్సిటీ - వెంకట బసవరావు
అనంతపురం జేఎన్టీయూ - హెచ్‌.సుదర్శనరావు
తిరుమల పద్మావతి మహిళా వర్సిటీ - ఉమ
మచిలీపట్నం కృష్ణా వర్సిటీ - కె.రాంజీ
ఆదికవి నన్నయ వర్సిటీ - ప్రసన్న శ్రీ
విక్రమ సింహపురి వర్సిటీ - అల్లం శ్రీనివాసరావు
Tags:    

Similar News