రాజకీయాల్లో అగ్రభాగాన చేనేతలు ఉండాలి

ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనంద ప్రసాద్;

Update: 2025-01-11 14:40 GMT

చేనేత వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కోసం అందరూ కలిసి పోరాట బాట పట్టాలని చేనేత కులాల ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ (ఏఐడబ్ల్యూఎఫ్) జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద ప్రసాద్ పిలుపు ఇచ్చారు. రాజకీయ పార్టీలు కూడా చేనేత వార్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ లో శనివారం చేనేత నాయకులు సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ఫెడరేషన్ నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా బండారు ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. చేనేత ప్రముఖులు అందరూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చేనేత వర్గాల వారు రాజకీయంగా మరింతగా ఎదగాలన్నారు. చేనేతల ప్రాధాన్యతను మరింత పెంచుకోవాలని చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని అన్నారు. చేనేతలకు రాజకీయంగా అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేతలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా బలపడటానికి చేనేత వర్గాల వారందరూ కలిసి కట్టుగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు.

చేనేత నాయకులు అందరితో కలిసి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి అనే దానిమీద ఫిబ్రవరి 2వ తేదీన గన్నవరంలో రాష్ట్రంలోని చేనేత ప్రముఖుల అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో సభ ఉద్దేశం, సభ లక్ష్యాలు నిర్ణయిస్తామని చెప్పారు. సభ ఎప్పుడు? ఎక్కడ? నిర్వహించాలి అనే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ సమావేశంలో అందరి నిర్ణయాలు తీసుకొని ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతుందని ఆనందప్రసాద్ తెలిపారు. చేనేతకు చెందిన 18 కులాలే కాకుండా చేనేత కార్మిక సంఘాలు, ఇతర సంఘాల ప్రముఖులు రాజకీయ నాయకులను కూడా ఒక వేదిక పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని చేనేత వర్గాలందరినీ భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, జనసేన నాయకులు గంజి చిరంజీవి, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, రాష్ట్ర చేనేత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ సమతం రమణ మహేష్, రాష్ట్ర అధ్యక్షుడు ఎనిమాల శివరాం ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, లేపాక్షి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బడిగంచుల విజయలక్ష్మి, చేనేత నాయకులు అవ్వారు ముసలయ్య, పి. బాలయోగి, నక్కిన చిన్న వెంకటరాయుడు, మునగాల మల్లేశ్వరరావు, రామనాథం పూర్ణచంద్రరావు, కూరపాటి కోటేశ్వరరావు, జొన్నాదుల మణి, కాసుల రవి, కట్ట హేమచందర్, కె. గణపతి, కె.లక్ష్మణరావు, ఆకురాతి రాజేష్, బత్తూరి మోహనరావు, కుమారస్వామి,జీవీ నాగేశ్వరరావు, రామనాథం పరమేశ్వరరావు, దామర్ల కుభేరస్వామి, ఇంజమూరి శ్రీనివాసరావు, పొట్లాబత్తుల లక్ష్మణరావు, రాపోలు జగన్, జొన్నాధుల భిక్షారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News