జనసేన మ్యానిపెస్టోలో ఏముంది?
జనసేన పార్టీ మానిఫెస్టోపై కసరత్తు త్వరలో పూర్తిచేసి టీడీపీ, జేఎస్‌పీ ఉమ్మడి మానిఫెస్టో విడుదలకు రంగం సిద్దం చేస్తోంది.;
Byline : The Federal
Update: 2024-01-11 12:59 GMT
జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మ్యానిపెస్టో తయారు చేసేందుకు వేరువేరుగా మ్యానిఫెస్టో కమిటీలు ఆయా పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించాయి. గురువారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మానిఫెస్టో కమిటీ సమావేశమై చర్చించగా ఇటీవల తెలుగుదేశం పార్టీ కూడా మానిఫెస్టోపై చర్చించింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా మానిఫెస్టో రూపొందుతోంది. విడివిడిగా తయారు చేసిన మానిఫెస్టోలను కలిపి ఒకే మానిఫెస్టోగా రూపొందించేందుకు కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ‘ప్రతి వ్యక్తికి చేతినిండా పని.. ప్రతి చేనుకూ నీరు’ నినాదంతో జనసేన మానిఫెస్టో రూపొందుతోంది.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మానిఫెస్టో కమిటీతో గురువారం జనసేన రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు ముత్తా శశిధర్, డి వరప్రాద్, ఫ్రొఫెసర్ కె శరత్‌కుమార్‌లు పాల్గొన్న సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చిచ్చాయి. జనం నుంచి వచ్చిన పలు ప్రతిపాదనలు కూడా సమావేశంలో చర్చించారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, వ్యవసాయ రంగానికి తోడుగా నిలడం, పేద ప్రజల సంక్షేమం, మహిళా భద్రత, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మానిఫెస్టో రూపొందుతోంది. వీలైనంత వ్వరగా మానిఫెస్టోను విడుదల చేసేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి నిర్ణయించింది.