రాజకీయాల్లో రఘురాముని పాత్రేమిటి?

కనుమూరు రఘురామకృష్ణంరాజు పేరు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎవరు ఈయన, ఎందుకు ఈయన గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

Update: 2024-03-31 10:17 GMT
Raghurama Krishnam Raju MP

ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఎంపిగా గెలుపొందిన రఘురామకృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పిచ్చికుక్క తిరిగినట్లుగా పార్టీలు మారారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ తరపున పార్లమెంట్ సీటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. సీటు రాకపోవడంతో భారతీయ జనతాపార్టీలో చేరారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 2019కి ముందు తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఇలా ఐదేళ్లలో మూడు పార్టీలను చుట్టేశారు. వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇవ్వడంతో నర్సాపురం నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.

జగన్ తో వైరం

గెలిచిన తరువాత వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైరం మొదలైంది. తనకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, అతను ఎలా రాజకీయాలు చేస్తాడో చూస్తానంటూ జగన్ బెయిల్ రద్దు చేయించేందుకు కోర్టుల చుట్టూ తిరిగారు. కోర్టులో వేసిన ప్రతి పిటీషన్ కు సమాధానం ఇస్తూ వచ్చారు జగన్. పరిపాలనపై శ్రద్ధ పెట్టలేనంతగా జగన్ ను వేధించారు రఘురామ. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడంపై సీఐడి పోలీసులు రాజద్రోహ నేరం కింద కేసు నమోదు చేశారు. కేసును విచారించకుండా ఆపివేయాలని వేసిన పిటీషన్ లను కోర్టు త్రోసిపుచ్చింది. దీంతో విచారణను ఎదుర్కొనక తప్పలేదు. అరెస్ట్ కూడా అయ్యారు. రెండేళ్ల క్రితం ఈకేసు నమోదైంది.

పార్టీలో తిరుగుబాటు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రఘురామ గెలిచిన ఏడాదిలోపులోనే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎత్తారు. రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎంపి పదవి నుంచి తొలగించాలని స్పీకర్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. అయినా ఆయనపై కేంద్ర పార్లమెంట్ చర్యలు తీసుకోలేదు. ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చారు. జగన్ పై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉన్నారు.

రఘురామపై సీబిఐ కేసు

రఘురామకృష్ణంరాజు బ్యాంకుల్లో ఫోర్జరీ సంతకాలు చేసి రుణం పొందారనే విషయంలో సీబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దాదాపు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఏకకాలంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంపై, ఇతర కార్యాలయాల్లో సీబిఐ తనిఖీలు చేసింది. ఫోర్జరీ పత్రాలతో బ్యాంకును మోసం చేసినట్లు నిర్థారణ కావడంతో కేసు నమోదైంది. పథకం ప్రకారం రూ. 237.84 కోట్లు రుణం తీసుకుని బ్యాంకును మోసం చేసినట్లు చెన్నై స్టేట్ బ్యాంకు డీజీఎం ఎం రవిచంద్రన్ సీబీఐకి చేసిన ఫిర్యాదుతో డొంక కదిలింది. ఢిల్లీలో సీబిఐ ఎస్పీ అశోక్ కుమార్ 2021 మార్చిలో కేసు నమోదు చేశారు. తమిళనాడులోని తుత్తుకూడిలో ఇండ్ భారత్ పవర్ జన్ కం లిమిటెడ్ కంపెనీ పేరుతో కంపెనీ స్థాపించి డబ్బును తీసుకుని బ్యాంకులను మోసం చేసినట్లు కేసు నమోదైంది. కంపెనీ ఆస్తులు బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కూడా తనకు జగన్ సహకరించలేదనే అక్కసుతో ఆయనపై నిప్పులు చెరిగారు.

కృష్ణాజిల్లా నివాసి

తాతలు కృష్ణాజిల్లా వాసులు, కృష్ణాజిల్లాలో పుట్టిన ఆయన తాత సత్యనారాయణ మొదటిసారి జిల్లా నుంచి ఎస్పి అయ్యారు. రఘురామ తండ్రి, తాతలు హైదరాబాద్ చేరుకుని అక్కడే ఉండిపోయారు. రఘురామ కూడా హైదరాబాద్ లోనే చదువుకున్నారు. ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారంపైనే దష్టి పెట్టారు. తర్వాత రాజకీయాలవైపు వచ్చారు. ఆస్తులు కాపాడుకునేందుకే రాజకీయాలను ఎంపిక చేసుకున్నారనే ఆరపణలు ఉన్నాయి.

పిచ్చి ప్రేలాపనలు

నాకు సీటు ఎందుకు రాదో చూస్తా? తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తా? బీజేపీ నుంచి పోటీ చేస్తా? అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు రఘురామ దీంతో ఆయన మీద ఉన్న గౌరవం కూడా ప్రజల్లో పోయింది. ఆయా పార్టీలకు రఘురామ ఏమైనా సేవలు చేసి ఆ పార్టీలను శాక్రిఫైజ్ చేశారా? ఎందుకు ఈయనకు సీటు ఇవ్వాలని ప్రశ్నించే వారి సంఖ్య కూడా ఎక్కువైంది. పార్టీలన్నీ ఆయన జేబు సంస్థలు అయినట్లు మాట్లాడుతూ వచ్చారు. దీనికి మీడియా కూడా ఎనలేని ప్రచారం కల్పించింది.

ప్రజల మధ్య ఎప్పుడైనా ఉన్నాడా?

ప్రజా ప్రతినిధిగా గెలిచిన తరువాత ప్రజల మధ్యకు ఒక్కరోజంటే ఒక్క రోజు కూడా వెళ్లలేదు. నేను నర్సాపురం వెళితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు నన్ను కొడతారని చెప్పుకుని పోకుండా ఆగిపోయారు. తప్పులు చేయనప్పుడు, చేసేవన్నీ మంచి అయినప్పుడు ఎందుకు కొడతారనేది పలువురి ప్రశ్న. చేసినవన్నీ తప్పులే. ఇప్పుడు ఇలా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఏ ఒక్కరికీ రాకూడదని పలువురు కోరుకోవడం విశేషం.

Tags:    

Similar News