వైఎస్సార్‌సీపీ, టీడీపీలపై షర్మిల వ్యూహాత్మక దాడి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకుంటుందా? షర్మిల వ్యూహాలు ఫలిస్తాయా? అన్నపై సంధిస్తున్న అస్త్రాలు పనిచేస్తాయా? టీడీపీ వారు ఎందుకు స్పందించడం లేదు.;

Update: 2024-01-24 05:48 GMT
శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకుంటుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ను జనం ఆదరించే రోజు ఆసన్నమైందని చెప్పొచ్చు. వైఎస్‌ తనయ వైఎస్‌ షర్మిలరెడ్డి తన మాటల చాతుర్యంతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈనెల 21న ఆంధ్రప్రదేశ్‌ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న షర్మిల వెనువెంటనే తన టూర్‌ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.

ఒక్క చాన్స్‌ అంటూ ప్రచార రంగంలోకి..

Delete
Edit

ఇచ్చాపురంలో వైఎస్సార్‌ పైలాన్‌ వద్ద ముందుగా నివాళులర్పించి రంగంలోకి దిగారు. పైలాన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్కం ఠాగూర్, ఏపీసీసీ మాజీ చీఫ్‌లు ఎన్‌ రగువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావులు ఉన్నారు. వైఎస్సార్‌ ప్రజాప్రజాప్రస్థానం ఇచ్చాపురంలో ముగిసినందున అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన వాళ్లమని, ఒక్క చాన్స్‌ ఇచ్చే రాష్ట్రం ఎలా ఉంటుందో చూస్తారన్నారు. ప్రజా ప్రస్తానం యాత్ర నుంచి ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా ఇళ్ల పథకాలని గుర్తు చేశారు.
జనంతో మమేకం..
శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి వెళుతూ మధ్యలో ఆర్టీసీ బస్‌లో ప్రయాణించారు. అంటే జనంతో మమేకమైన పనిచేస్తున్నదని భావించేందుకు ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడికి వచ్చిన మీడియాతోనూ బస్‌లోనే మాట్లాడారు. బస్‌లోని చాలా మందిని పలకరించారు. బస్‌లో ప్రయాణిస్తున్న వారు కూడా షర్మిలను పలకరించేందుకు ఆసక్తి చూపించారు. విజయనగరం చేరుకుని అక్కడి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో ప్రత్యేక మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాన్ని వారికి చెప్పారు.
వ్యూహాత్మకంగా కొణతాలతో భేటీ..

Delete Edit

మంగళవారం రాత్రికి విశాఖపట్నం చేరుకున్న షర్మిల నేరుగా మాజీ మంత్రి కొణతల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయనతో కొద్దిసేపు సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ తాజా పరిణామాలు, జరుగుతున్న పోరాటాల గురించి చర్చించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు ఏ విధమైన ఉద్యమాలు నిర్వహిస్తే బాగుంటుందనే సలహా కూడా షర్మిల తీసుకున్నట్లు సమాచారం.
నేడు విశాఖలో సమావేశం
బుధవారం విశాఖపట్నంలోని హోటల్‌ దస్‌పల్లాలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి అనకాపల్లి చేరుకుని పార్టీ వారితో సమావేశం నిర్వహించిన అనంతరం తిరిగి విశాఖ ఉక్కు పరిశ్రమ యూనియన్‌ నాయకులు, ఉద్యోగులతో మాట్లాడతారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పేందుకు అక్కడ కాంగ్రెస్‌ వారు నిర్వహించే ఉద్యమంలో పాల్గొంటారు.
ఎక్కడైతే ముఖ్యమైన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉంటారో వారందరినీ కలిసేందుకు నిర్ణయించారు. గతంలో పార్టీలో ముఖ్యమైన హోదాల్లో పనిచేసి ఇప్పుడు ఏ పార్టీలో చేరకుండా కాళీగా ఉన్న వారిని తప్పకుండా కలవాలనే నిర్ణయంతో ఉన్నారు. కొణతల రామకృష్ణను కలవడం రాజకీయంగా మైలేజీ వచ్చే అంశమేనని పలువురు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ రోజు రాత్రికి కాకినాడలో బస చేస్తారు. అక్కడ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.
విమర్శలను తిప్పి కొడుతూ..
షర్మిల తన చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుతుంటే జరిగిందంతా అభివృద్ధేనని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ నేను రెడీగా ఉన్నాను వైవీ సుబ్బారెడ్డిగారూ... అభివృద్ధి ఎక్కడుందో చూపించండి, సమయం, తేదీ మీరు చెప్పినా ఒకటే, నన్ను చెప్పమన్నా ఒకటే ఎప్పుడంటే అప్పుడే చర్చిద్దాం. అక్కడికి మీడియా, మేధావులను కూడా ఆహ్వానిద్దాం. అంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు బస్‌ ప్రయాణంలో చేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే సెటైర్లు వేశారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలంటే వైఎస్‌ కుటుంబాన్ని వంచించిన పార్టీలోకి షర్మిల వెళ్లి అన్న వైఎస్‌ జగన్‌ను విమర్శించడం తగదని హితవులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
షర్మిల విషయంలో నోరెత్తని టీడీపీ నేతలు
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించే సభలో తెలుగుదేశం పార్టీపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన తరువాత మొదటి ఐదు సంవత్సరాల్లో గ్రాఫ్‌లు చూపించడం తప్ప చంద్రబాబు ఏమి చేశారని ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా పదేళ్లు ఆంధ్ర ఉందని నేతలను ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అసలు షర్మిల వ్యవహారమే పట్టనట్లు వ్యవహరించారు. జగన్‌తో సమానంగా చంద్రబాబుపై విమర్శలు చేసినా చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా కిమ్మనకపోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ వారు జగన్‌ను విమర్శించడాన్ని అంగీకరించలేకపోయారు. కారణం స్వయానా షర్మిలకు అన్నకావడం వల్ల ప్రజలు షర్మిల మాటలపై ఆలోచనలు చేసే అవకాశం ఉంటుందని వైఎస్‌ఆర్‌సీపీ వారు భావిస్తున్నారు. తన చెల్లెలు వ్యాఖ్యలపై జగన్‌కూడా స్పందించడం విశేషం.
Tags:    

Similar News