600కి 600 మార్కులు సాధించిన ఈ బాలిక ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలు కొన్ని కుటుంబాల్లో సంతోషం నింపగా మరి కొన్ని కుటుంబాల్లో విషాదం నింపింది.;
By : The Federal
Update: 2025-04-23 11:55 GMT
ఆంధ్రప్రదేశ్ లో బుధవారం టెన్త్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలలో 81.14 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఈసారి ఫలితాల్లో ఓ బాలిక 600కి 600 మార్కులు సాధించి రికార్డు çసృష్టించింది. అయితే ఇలా నూటికి నూరు శాతం మార్కులు రావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయి.
ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.14శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 93.90శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటిస్థానంలో ఉంది. దాదాపు 1680 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. బాలికల్లో 84.09 శాతం, బాలురలో 78.31 శాతం పాసయ్యారు.
600కి 600 మార్కులు సాధించిన ఈ బాలిక ఎవరు?
కాకినాడకు చెందిన ఓ విద్యార్థిని నేహాంజలి టెన్త్ ఫలితాల్లో (అ్క ఇ ఖ్ఛటu ్టట2025) అరుదైన ఘనత సాధించింది. ఈ బాలిక 600/600 మార్కులు సాధించింది. కాకినాడలోని భాష్యం పాఠశాలలో ఆ బాలిక చదువుతోంది. ఎలమంచిలి శ్రీచైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనీష అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది. 1,680 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.
అనుమానాలు ఎందుకంటే..
600 కి 600 ఎలా వచ్చాయి అనే దానిపై అనుమానాలూ లేకపోలేదు. తెలుగులో 100 కి 100 రావని, ఇంగ్లీష్‌లో ఒక్క పదం కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసిందా? అని మరి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సైన్స్‌లో కూడా అంత పర్ఫెక్ట్ గా రాయడం, బొమ్మలు వేయడం జరిగిందా, రైటింగ్ సరిగా లేకపోయినా, కొట్టివేతలు ఉన్న, మార్కులు తగ్గిస్తారు మరి అంత పర్ఫెక్ట్ గా రాసిందా రాష్టం మొత్తంలో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఇలా మార్కులు రావడం లేదని రిటైర్డ్ టీచర్ శౌరయ్య అన్నారు. మరో వైపు పదో తరగతి ఫలితాలు కొన్ని కుటుంబాల్లో సంతోషం నింపగా మరి కొన్ని కుటుంబాల్లో విషాదం నింపింది. పదో తరగతిలో ఫెయిలయ్యారనే తీవ్ర మనోవేదనకు గురైన ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో ఒకరు, అనకాపల్లి జిల్లాలో మరొక విద్యార్థి బలవన్మరణాలకు పాల్పడ్డారు.