ఎవరీ వంశీ, ఎందుకీ హంగామా?

వంశీని వదిలే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. తాను ఏ తప్పూ చేయలేదంటున్నారు వంశీ. నిజాన్నికక్కిస్తామంటున్నారు పోలీసులు. ఏమవుతుందో చూడాలి;

Update: 2025-02-14 18:08 GMT
వల్లభనేని వంశీ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మార్మోగుతున్న పేరు. పేరు మోసిన క్రిమినల్ అని పోలీసులు, అమాయకుడు, రాజకీయ కక్షతోనే వేధిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడాయన ఇరుక్కున్న కేసు చూస్తుంటే మాత్రం ఆయనో పెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని తెలుస్తోంది. నిండా 55 ఏళ్లు కూడా లేని ఇతడు ఇన్ని నేరాలు చేశారని జనం ముక్కున వేలేసుకునే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)ని పోలీసు కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు చెబుతున్నారు. ఆయన్ని వదిలే ప్రసక్తే లేదని పోలీసు బాసులు తెగేసి చెబుతున్నారు. పోలీసు కస్టడీకి తీసుకుని నిజాలు కక్కిస్తామంటున్నారు.
‘‘ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా అరెస్ట్‌ చేస్తాం. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. నేరం ఎలా జరిగిందనే దాని విషయంలో సాంకేతిక అంశాలపైనా దృష్టిపెట్టాం. టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కేసును పకడ్బందీగా డీల్‌ చేస్తున్నాం’’ అని సీపీ రాజశేఖర్‌బాబు చెప్పకనే చెప్పారు.
వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు ఫిబ్రవరి 13 గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ వ్యవహారంలో వంశీతోపాటు మరికొందరిపై విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్‌ చేసి విజయవాడ తీసుకొచ్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో విజయవాడ నగరంలోని జిల్లా జైలుకు తరలించారు.
అసలింతకీ ఎవరీ వంశీ..
వల్లభనేని వంశీ మోహన్ కృష్ణా జల్లా గన్నవరానికి చెందిన వారు. చూడడానికి ఎంతో అమాయకంగా కనిపించే ఈ వ్యక్తి కృష్ణా జిల్లాలో బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ప్రముఖ వ్యక్తి. సినీ నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ప్రాముఖ్యత సాధించారు. సినిమారంగం నుండి రాజకీయాల్లోకి ఆయన ప్రయాణం సాగింది. ఆయనవి విభిన్నమైన ఆసక్తులు. డబ్బు పట్ల ఏమాత్రం యావలేని వ్యక్తిగా కనిపిస్తూనే అపారంగా డబ్బు వేటలో మునిగితేలినట్టు ప్రస్తుతం బయటపడుతున్న వ్యవహారాలను బట్టి తేలుతోంది. ప్రజా సేవ పట్ల ఎంత ఆసక్తి ఉందో తెలియదు గాని ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మాత్రం ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్లు గెలిచిన ప్రాంతం.
వల్లభనేని వంశీ మోహన్ - జీవిత వివరాలు
పేరు: వల్లభనేని వంశీ మోహన్
ముద్దుగా పిలిచే పేరు: వల్లభనేని వంశీ
పుట్టిన తేది: 26 సెప్టెంబర్ 1971
ప్రస్తుతం నివాసం: గన్నవరం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
మతం: హిందూ
జాతీయత: భారతీయుడు
ఎత్తు: 169 CM
హాబీలు: సినిమాలు చూడడం
తండ్రి: మార్హత వల్లభనేని రమేష్ చంద్ర
సతీమణి: పంకజ శ్రీ
విద్యార్హత: M.V.Sc (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్)
కళాశాల: అగ్రికల్చరల్ యూనివర్సిటీ, తిరుపతి
సినిమా రంగ ప్రవేశం:
చిత్రం: అదుర్స్ జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన సినిమా అది. ఆ తర్వాత ఆయన టచ్ చేసి చూడు అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.
1971లో పుట్టిన వల్లభనేని వంశీ మోహన్ బాల్యం గన్నవరంలోనే సాగింది. ఆయన తండ్రి వల్లభనేని రమేష్ చంద్ర. వంశీ మోహన్ పంకజ శ్రీను వివాహం చేసుకున్నారు. ఆయన తల్లి పేరు ఎక్కడా కనిపించదు. పిల్లలెందరో కూడా తెలియదు. విద్యార్హత విషయానికి వస్తే, ఆయన తిరుపతిలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ (కృషి విశ్వవిద్యాలయం) నుండి డిగ్రీ తీసుకున్నారు. 1992లో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (M.V.Sc) పూర్తి చేశారు. అనంతరం, 2024లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హైదరాబాద్ నుంచి మరో డిగ్రీ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం అమెరికా వెళ్లి వచ్చారని చెబుతున్నారు.
వల్లభనేని వంశీ మోహన్ 2014లో తొలిసారిగా గన్నవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యుడిగా (MLA) ఎన్నికయ్యారు. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దత్త రామచంద్రరావును 9,548 ఓట్ల తేడాతో ఓడించారు.
2019లో ఆయన మరోసారి టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావును 838 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత, ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ)లో చేరారు. ఆయన వైఎస్సార్ సీపీలో చేరడానికి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీ కారణం అని చెబుతున్నారు. వాస్తవానికి వీరిద్దరూ సినీరంగ ప్రముఖులకు ఫైనాన్స్ చేస్తుంటారని వినికిడి.
వంశీ మోహన్ తన వృత్తిని సినీ నిర్మాతగా ప్రారంభించారు. ఆయన తన నిర్మాణ సంస్థ ద్వారా పలు తెలుగు సినిమాలను నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఆదుర్స్ అనే సినిమాను వంశీ తీశారు.
రాజకీయ రంగ ప్రవేశం
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఆయన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. సమాజ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించాలనే ఉద్దేశ్యంతో 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి, శాసనసభ్యుడిగా (MLA) స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రజా ప్రతినిధిగా, ఆయన గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యసేవలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించి, తన నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
సినీ నిర్మాతగా ఉన్న అనుభవం, మీడియా శక్తిని అర్థం చేసుకున్న ఆయన, ప్రజలకు తాను చెప్పదలచుకున్న సందేశాన్ని సమర్థంగా చేరవేయగలిగారు. రాజకీయ జీవితంలో వివాదాలు, సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రజాసేవ పట్ల మొగ్గుచూపారు. నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు వంశీ మోహన్ కృషి చేసినట్టు చెబుతారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితి
ప్రస్తుతం వంశీ మోహన్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. మొదట టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ)లో చేరారు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంశీ మోహన్ వాడిన భాష, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో సాగిన వ్యవహారాలు ఇప్పుడాయన్ని చుట్టుముట్టాయి. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పుడాయన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. ఆయనపై మోపిన కేసులు నిరూపితమైతే ఆయనకు కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Tags:    

Similar News