ఏపీ ఎంపీలు ఎందుకు సాధించలేక పోతున్నారు..

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి ఒక్క ప్రత్యేక పథకమైనా రాలేదు. ఎంపీల్లో పోరాట పటిమ లేదని తేలిపోయింది. కారణాలు ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు.;

Update: 2025-01-29 06:05 GMT


అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదనే సామెత ఉంది. ఇది ఎందుకు వచ్చింది? అమ్మ అడగకుండా అన్నం పెట్టలేక కాదు. ఇంట్లో ఉన్న పేదరికంతో అల్లాడుతూ అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉండటం వల్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి కూడా అంతే. అడగకుంటే ఏదీ సాధించలేరు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రం పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మంగళవారం ప్రకటించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. అంతకు ముందు పరిపాలించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు జేసి చంద్రబాబు వెళ్లిపోయారని పాట పాడారు. ఒకరు పోయి మరొకరొచ్చినా పాటలో మాత్రం తేడా రాలేదు. ఇదేనా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది. నిజానికి జగన్ ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఆయన ఎందుకు చిత్తుగా ఓడిపోయారు. వ్యక్తి గత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. భవిషత్ లో రాష్ట్రం దేశంలోనే ఉన్నతమైనదిగా ఉండాలని ప్రజలు కాంక్షించారు. వారి ఆకాంక్షను జగన్ తీర్చలేక పోయారు కాబట్టే పార్టీని పాతంళంలో పడేశారు.

కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడు నెలలు దాటింది. ఒక్క అంశం కూడా కుదుట పడలేదు. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆ అంశంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణకు పనులు అప్పగించారు. ఆ తరువాత రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెబుతున్నారు. గత ప్రభుత్వం లాగే ఉచిత హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలే కాకుండా గతంలో జగన్ ఇచ్చిన ఉచిత నగదు పథకాలు యధా తధంగా కొనసాగుతాయని ఎన్నికల్లో చెప్పారు. కానీ అవేవీ కనిపించడం లేదు. తెరమరుగయ్యాయి. అయినా ప్రజలు కోరుకుంటోంది అభివృద్ధి అనేది స్పష్టమైంది. కేంద్రం ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు ను కేంద్రమే నిర్మాణం చేపట్టి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేది. అలా కాకుండా రాష్ట్రం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుని వేసిన అడుగులు తప్పటడుగులుగా మారి పదేళ్ల తరువాత మళ్లీ మొదటి నుంచి ఎత్తుకున్నారు.

Delete Edit

ఇక ఈ రాష్ట్రానికి కేంద్ర సాయమే దిక్కు. కేంద్రం అమరావతికి అప్పులు ఇప్పించినా.. పెట్టుబడి దారులను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పినా అవేవీ ఉపయోగ పడవు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేసి వాటి నిర్మాణాలు, మరమ్మతులు ఈ నాలుగేళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రం తీసుకున్న అప్పుల్లో కనీసం సగం కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. వెనుక బడిన ప్రాంతాలకు ఇస్తామని చెప్పిన ప్యాకేజీలు ఇవ్వాలి. సీజీఎస్టీని రద్దు చేయాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలి. అప్పుడే రాష్ట్రం కాస్త ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ఎంపీలు ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ప్రత్యేకించి పేదలకు పైసా ఖర్చులేకుండా సకాలంలో వైద్యం, విద్య అందేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు రాష్ట్ర బడ్జెట్ లో చేసే కేటాయింపులు సరిపోవు. అందుకే కేంద్రం నుంచి ప్రత్యేకంగా గ్రాంటులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని సూటిగా ప్రశ్నించాలి. అవసరమైతే పార్లమెంట్ ను స్తంభింప జేయాలి. అంతే కాని బ్రతిమాలు కుంటే సాయం అందించే రోజులు పోయాయని ప్రజలు చర్చించుకోవడం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వానికి ఇదొక మంచి అవకాశం. కేంద్రంలోని కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం కొనసాగాలంటే ఏపీ ఎంపీల సపోర్టు ఎంతో అవసరం. ఎంపీలు సపోర్టును ఉప సంహరించుకుంటే కేంద్రంలోని ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీలు ఎందుకు పోరాడటం లేదనేది ప్రశ్నగా మారింది. కేవలం నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోరాట మంటే రోడ్ల పై కూర్చుని రోడ్డు రోకోలు చెయ్యడం కాదు. మాటలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కూడా పోరాటమే. శ్రమలేని పోరాటం చేసేందుకు కేంద్రంలో ప్రస్తుతం రాష్ట్ర కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాకుండా రాష్ట్రాన్ని మరెప్పుడూ అభివృద్ధి చేయలేరు. దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలనే సామెతగా ప్రస్తుతం రాష్ట్రానికి వెలుగులు నిండాలంటే కేంద్రం పెద్ద మనసుతో సాయం చేయాలి తప్ప వేరే మార్గాలు కనిపించడం లేదు. వారిచేత, వీరి చేత డబ్బులు ఇప్పించామంటే కాదు. తమ వంతుగా రాష్ట్రాభివృద్ధికి ఏమి చేశామని ధైర్యంగా కేంద్రం చెప్పాల్సిన పరిస్థితిని ఎంపీలు కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది.

పాలకుల తప్పులు ఎత్తి చూపించే వారు లేకుండా పోవడంతో నాయకుల్లో సోమరితనం పెరిగింది. ఆలోచనలు సొంతానికి తప్ప ప్రజల పక్షాన నిలబడేందుకు చేయలేక పోతున్నారు. విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా ఇవ్వగలిగితే ప్రజలు అంతకు మంచి ఏమీ కోరుకోరని పాలకులు తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగు నీరు ఇవ్వగలిగితే ఏ ఫ్యాక్టరీ ఈ రాష్ట్రానికి అవసరం లేదని, ధాన్యాగారంగా రాష్ట్రం విలసిల్లుతుందన్నారు.

ఎంపీలు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం గురించి మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉద్బంధించారు. ఉద్బోధలో వారికి చెప్పంది ఒకే ఒక్క అంశం. రాష్ట్రానికి నిధులు సమకూర్చుకునే విధంగా మాట్లాడాలని, హితోధికంగా సాయం చేయాలని కోరాలన్నారు. ప్రత్యేకించి రాష్ట్రంలో సీజీఎస్టీని రద్దు చేయాలనో, ప్రత్యేక హోదా ఇశ్వాలనో, రాయలసీమ, ఉత్రరాంధ్రలకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలనో ఎందుకు డిమాండ్ చేయడం లేదు. ఈ విషయాలపై గట్టిగా పార్లమెంట్ లో నిలదీయాలని సీఎం సభ్యులకు ఎందుకు చెప్పటం లేదనేది కూడా పలువురిలో చర్చ నియాంశమైంది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News