చిత్తూరు జిల్లా రైతు ఎందుకు విషాదంలో ఉన్నారు?
మామిడి చెట్లను కూల్చివేయడం వెనుక రైతు బాధ ఎలా ఉందంటే...;
Also Read:TTD | ఓ యాత్రికా.. తిరుమలపై మీ అ అభిప్రాయం చెబుతారా?
చిత్తూరు జిల్లా మామిడి తోటల రైతాంగంతో ధరలు దోబూచులాడుతున్నాయి. రామచంద్రాపురం మండలంలో మామిడి తోటల రైతులకు పెద్దకష్టం వచ్చింది. నష్టాలు భరించలేక కన్నబిడ్డల్లా పెంచిన వందలాది ఎకరాల్లో 40 ఏళ్ల వయసు మామిడి చెట్లను నిలువునా నరికి వేస్తున్నారు. మొదళ్లతో సహా పెకిలించి, వంటచెరుకుగా విక్రయిస్తున్న దయనీయ స్థితి ఇది.
"ఈ సీజన్లో చివరి కాయ వరకు కొంటాం. కిలో కు 12 రూపాయలు మద్దతు ధర నిర్ణయించాం" అని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, తిరుపతి కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ప్రకటించారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు, గుజ్జు పరిశ్రమల యజమానులు ఎనిమిది రూపాయలు చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ర్యాంపుల వద్ద అధికారులను నియమించారు. గుజ్జు పరిశ్రమల యజమానులతో చర్చించారు. ప్రభుత్వ నిర్ణయం సజావుగా అమలు చేస్తుంటే..
On The Federal Andhra Pradesh YouTube ఛానల్ లో చూడండి