తమిళనాడులో పవన్ కల్యాణ్ కు బీజేపీ వాళ్లు ఎందుకు జై కొట్టారు

Update: 2025-02-14 09:47 GMT

నటుడిగా పవన్ కల్యాణ్ కు అభిమానులు జై కొట్ట వచ్చు. జనసేన పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తలు, నాయకులు జై కొట్ట వచ్చు. కానీ బీజేపీ వాళ్లు, అందునా తమిళనాడు బీజేపీ కి చెంది వారు పవన్ కల్యాణ్ కు జై కొట్టడం ఏమిటనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. వెళ్లింది దేవాలయాల సందర్శనకు, ఇక్కడ రాజకీయాలు వద్దని విలేకరులకు సర్థి చెప్పారు. కానీ తమిళనాడు లోని బీజేపీ వాళ్లు వచ్చి నేరుగా మెడలో దండలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. బాణా సంచా పేల్చి సంబరాలు చేశారు. జై పవన్ కల్యాణ్ అంటూ ఆనందంగా ఎగిరారు. ఏపీలో బీజేపీ వారు ఇంత వరకు పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి సత్కరించలేదు. పూల దండలు వేసి అభినందించలేదు. కానీ తమిళనాడులో జరిగింది.

రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తా..

తమిళనాడుకు మంచి చేయాలని ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఆహ్వానిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పుడే సోషల్ మీడియా ద్వారా సుభాకాంక్షలు తెలిపాను. తమిళనాడుకు, భారత దేశానికి మంచి చేయాలని ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఆహ్వానిస్తానని చెప్పారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూర్ సుబ్రమణ్య స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన తూతుకుడి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

Delete Edit

బీజేపీలో జనసేన విలీనం అవుతుందా?

జనసేన పార్టీని రానున్న రోజుల్లో బీజేపీలో విలీనం చేసే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడేమోననే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. తమిళనాడులో బీజేపీ శ్రేణులు పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికి సంబరాలు చేసుకోవడం చూస్తుంటే రానురాను దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా బీజేపీ వారు ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో బీజేపీకి పట్టు లేదు. రెండు నుంచి మూడు శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయనేది వాస్తవం. ఏ పార్టీతో పొత్తులేకుండా బీజేపీ పోటీ చేస్తే వచ్చే ఓట్లు కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే. ఏపీలో బీజేపీని బలో పేతం చేయాలంటే జనంలో పరపతి ఉన్న నాయకుడు తప్పకుండా తెరపైకి రావాలి. అలాంటి నాయకుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు మనతో ఉన్నాడు. అందుకే ఆయనను మనం ఎంత త్వరగా దగ్గరకు తీసుకుంటే అంత మంచిదనే ఆలోచనలో బీజేపీలోని ఉన్నత శ్రేణి నాయకత్వం ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

15 ఏళ్లు సీఎం గా చంద్రబాబే అని ఎందుకు అన్నారు..

15 ఏళ్లు చంద్రబాబే సీఎం గా ఉండాలని పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటనే చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్ లో బీజేపీ ద్వారా తాను రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యాడా? అందువల్లే ఈ విధంగా మాట్లాడారా? అనే చర్చ కూడా జరుగుతోంది. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే కేంద్రం పెద్దల ఆశీస్సులతో ఏపీకి బీజేపీ నాయకుడిగా ఉంటూ రాజకీయాలు చేయొచ్చనే ఆలోచనతో అన్నాడా? జగన్ ను ఎదుర్కొనేందుకు చంద్రబాబుతో ఉండటమే మంచిదనే భావనతో అన్నాడా అనేది చర్చకు దారితీసింది.

జనసేన పవర్ లోకి వచ్చే సత్తా లేదని తేల్చారా?

ఏ పార్టీ నాయకుడైనా తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటాడు. అలా కాకుండా చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నాడంటే జనసేన పార్టీ స్వతహాగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించి ఉండొచ్చని, అందువల్లే ఈ విధంగా వ్యాఖ్యానించారని, బీజేపీతో ఉంటే దక్షిణ భారత దేశంలో తిరుగులేని నాయకుడిగా ఎదగొచ్చనే ఆలోచన కూడా పవన్ కల్యాణ్ లో ఉండి ఉండవచ్చనేది రాజకీయ విశ్లేషకుల భావనగా ఉంది.

అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించడం, స్వామిమలైలోని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శన అనేవి భక్తితో చేసినా అక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఉందనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సందర్శించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆర్ఎస్ఎస్, విహెచ్ పి శ్రేణులు బలంగా ఉన్నాయనేది పలువురు చెబుతున్న మాట. ఒక సారి ఈ ప్రాంతాలకు వెళితే మొక్కు చెల్లించుకోవడంతో పాటు బిజేపీ వారి స్పందన ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చనే ఆలోచనతో వెళ్లి ఉంటారనే చర్చ కూడా ఏపీ ప్రజల్లో ఉంది.

Tags:    

Similar News