ORGANIC | ప్రకృతి సేద్యంతోనే మానవాళి భవిష్యత్ అంటున్న చంద్రబాబు!

ప్రకృతి సాగుతోనే ప్రపంచ దేశాలన్నీ క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.;

Update: 2025-01-15 02:30 GMT
ప్రకృతి సాగుతోనే ప్రపంచ దేశాలన్నీ క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేంద్రీయ సాగును మరింత ప్రోత్సహిస్తుందని చెప్పారు. చిత్తూరు జిల్లా లోని తన సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ గ్రామంలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఆ కేంద్రంలోని కందులవారిపల్లె, ఎ.రంగంపేట, చిన్నరామాపురం కార్యకర్తలతో సమావేశమయ్యారు. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.
ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే...
‘‘ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యంవైపు చూస్తున్నాయి. మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చింది. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది.. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోంది. సూక్ష్మ నీటిపారుదల విధానాన్ని మరింత ప్రోత్సహిస్తాం. చీడపీడల నుంచి రక్షించుకునే పద్ధతులు మారాయి. మామిడిపంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయి. డ్రోన్ల ద్వారా చీడపీడలు గుర్తించే సాంకేతికత వచ్చింది. పశువులకు ఎక్కడికక్కడ షెడ్లు నిర్మిస్తాం. గడ్డి పెంచే క్షేత్రాల సంఖ్య పెంచుతాం. పాల దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. తిరుపతి జిల్లా మొత్తం పారిశ్రామికీకరణ చేస్తాం. తిరుపతి జిల్లాకు చెందినవారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. భవిష్యత్తులో సెల్‌ఫోన్‌ మీకు ఆయుధంలా పనిచేస్తుంది. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత వినియోగిస్తాం. విద్యార్థులు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ నాలెడ్జ్‌ పెంచుకునేందుకు చూడాలి’’ అన్నారు.
ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు వాటిలో కేవలం 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని ఆయన చెప్పారు. నీళ్లు ఉంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండగకు కుటుంబసమేతంగా నారావారిపల్లె (Naravaripalle) వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్థానిక టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. " వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. ప్రకృతి సేద్యం అన్ని వేళలా ఆదాయం ఇస్తుంది. గత ఐదేళ్లుగా బిందు సేద్యం పడకేసింది. మనం తినే ఆహారం ఎలాంటిదో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చింది. అందుకే అందరూ హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. డెయిరీలో ఆదాయం పెరిగింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగిపోయింది. డ్రోన్ల ద్వారా చెట్లను పరిశీలించవచ్చు. దెబ్బతిన్న చెట్లకు వాటి సహాయంతో పురుగుమందులు వేయెుచ్చు. సేంద్రియ సాగుకు నేనే శ్రీకారం చుట్టా. రాష్ట్రంలో సేంద్రియసాగును మరింత ప్రోత్సహిస్తాం.
వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో సెల్ ఫోన్ మీకు ఆయుధంగా పని చేస్తుంది. సంక్షేమ పథకాల్లో మోసాలు జరగకుండా టెక్నాలజీ వినియోగిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయెుచ్చు. అదనపు విద్యుత్‌ను అమ్ముకుని డబ్బులు సంపాదించొచ్చు. ఇందుకు కుప్పం నియోజకవర్గాన్ని మోడల్‌గా తయారు చేస్తాం. తెలుగు వాళ్లు అమెరికాలో అమెరికన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ రావాలి. నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నా ప్రజల కోసమే పని చేస్తున్నా. నా ఆలోచనలు ఉపయోగించుకుని ఎంతోమంది జీవితంలో పైకి వచ్చారు. ఆ రోజు నేను చూపించిన విజనరీ వల్లే నేడు హైదరాబాద్‌లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, ఐటీ వల్ల ఎంతో మంది లాభపడ్డారని" చెప్పారు.
Tags:    

Similar News