బీజేపీ అభ్యర్థులకు తప్పని కూటమి తిప్పలు
కూటమి నుంచి రంగంలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు స్థానిక నేతలు, కార్యకర్తల సమస్యలు నేటికీ తగ్గ లేదు. ఆందోళనలో అభ్యర్థులు.
Byline : The Federal
Update: 2024-05-11 15:12 GMT
ఆంధ్రప్రదేశ్ నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణుల నుంచి ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అసెంబ్లీ నియోజక వర్గాల సీట్ల కేటాయింపుల్లో నెలకొన్న బేధాబిప్రాయాలు ఇంకా సర్థుమణగ లేదని, దీంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యక్తలు ముభావంగానే ఉన్నారనే టాక్ ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు ఇక రెండు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలు ఎన్డీఏ కూటమి నేతలలో ఆందోళనలు రేకితిస్తున్నాయనే టాక్ కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించారు. అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్‌రాజు, ధర్మవరం నుంచి వై సత్యకుమార్, విజయవాడ వెస్ట్ నుంచి సుజనాచౌదరి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరాఉవ, ఆదోని నుంచి పీవీ పార్థసారథి, అరుకు నుంచి పాంగి రాజారావు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నుంచి బొజ్జా రోషన్నలు బీజేపీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి నుంచి రంగంలో ఉన్నారు.
అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తొలుత మాజీ సిపాయి శివరామకృష్ణమరాజుకు ఈ సీటు బీజేపీ కేటాయించింది. తర్వాత ఇక్కడ ఈక్వేషన్స్ మారాయి. స్వయంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ నుంచి బరిలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరీ రంగంలోకి దిగి అభ్యర్థిని మార్పు చేసినట్లు స్థానికుల్లో చర్చగా మారింది. ఇక్కడ టీడీపీకి సీటు ఇస్తే తనతో పాటు అనపర్తి సీటును సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చారు. దీంతో 2014లో టీడీపీ నుంచి గెలిచి 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. దీంతో తొలుత అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృష్ణమరాజు, ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో బీజేపీ నేతల మధ్య కూడా కొంచెం గ్యాప్ నెలకొన్నాయని, ఇవి గెలుపు ఓటములపై ప్రభావం పడే చాన్స్ ఉందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. విజయవాడ పశ్చి స్థానంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు టాక్ ఉంది. ఈ సీటును జనసేనకు కేటాయిస్తారని టాక్ వచ్చింది. ఫైనల్‌గా బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బరిలో ఉన్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన మహేష్ జనసేనపైన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా తీవ్ర విమర్శలు గుపించండంతో పాటు ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పోతిన మహేష్‌కు ఇక్కడ మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో 23వేల వరకు ఓట్లు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఎన్డీఏ కూటమిపై ప్రభావం చూపే చాన్స్ ఉంది. దీంతో పాటుగా టీడీపీ సీనియర్ నేతల్లో కూడా అసంతృప్తులు ఉన్నట్లు స్థానికుల్లో చర్చ సాగుతోంది. కామినేని శ్రీనివాస్ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2014లో ఈయన ఇక్కడ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన జయమంగళ వెంకటరమణ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లడం, జనసేన నేతలు గుర్రుగా ఉండటం, కామినేనికి సహకరించక పోవడం వంటి కారణాలతో కూటమి నేతల్లో గ్యాప్‌లు ఉన్నాయని, ఇది కామినేని గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికుల్లో టాక్ ఉంది.
విశాఖపట్నం నార్త్ నుంచి బీజీపీ అభ్యర్థిగా పి విష్ణుకుమార్‌రాజు బరిలో ఉన్నారు. ఈయన 2014లో ఇక్కడ నుంచి గెలిచి, 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇక్కడ కాపులు ఎక్కువుగా ఉండటం, ఈ సారి కాపు అభ్యర్థికే జనసేన నుంచి సీటు కేటాయిస్తారని భావించారు. అయితే బీజేపీకి కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వర్గీయులు, జనసేన శ్రేణులు కూడా దూరంగా ఉంటున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది వైఎస్‌ఆర్‌సీపీకి అడ్వాంటేజీగా మారే చాన్స్ ఉందని టాక్ ఉంది. ఇలా మిగిన ఎచ్చెర్ల, ధర్మవరం, ఆదోని, అరకు, జమ్మలమడుగు, బద్వేలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయని, అవి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇలాంటి సమస్యల పరిష్కారంపై ఆ పార్టీ పెద్దలు దృష్టి సారించినట్లు సమాచారం.