అమరావతిలో జూలాజికల్ సర్వే సంస్థ

అమరావతిలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయ నిర్మాణం జరగబోతోంది. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం సోమవారం సీఆర్ఢీఏకు జడ్ఎస్ఐ వారు రుసుము చెల్లించారు.

Update: 2024-07-16 02:25 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) నూతన కార్యాలయానికి మార్గం సుగమమైంది. సీఆర్ఢీఏకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి జడ్ఎస్ఐ కార్యాలయ నిర్మాణానికి ప్లాన్ ను సర్వే సంస్థ వారు సమర్పించారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కూడా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఇక్కడ భవనాలు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే సీఆర్డీఏకి డబ్బులు చెల్లించి, భవన ప్రణాళికను సమర్పించింది. సోమవారం రాయపూడి పంచాయతీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ వాటి మనుగడకు సంబంధించి పరిశోధనలు సాగిస్తుంటుంది.

జీవ శాస్త్రంలోని ఒక ముఖ్యమైన విభాగం జంతు శాస్త్రం. ఇది జంతువులకు సంబంధించి వాటి పెరుగుదల నిర్మాణం, అండోత్పత్తి, పరిణామం, వర్గీకరణ, అలవాట్లు, జంతువుల పంపిణీ, జీవించి ఉన్న, అంతరించి పోయిన జంతువుల గురించి సమగ్రంగా తెలియజేస్తుంది. జంతుశాస్త్రాన్ని ఇంగ్లీషులో జువాలజీ అంటారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా జంతు ప్రదర్శన శాలలు ఎక్కడెక్కడ ఏపీలో ఏర్పాటు చేస్తే బాగుంటుందో, ఆ జంతు ప్రదర్శన శాలల్లో జంతువులను చూసేందుకు వచ్చే ప్రజలకు మంచి వాతావరణం కల్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వీరి ద్వారా సాధ్యమవుతుంది.

Tags:    

Similar News