కవితను హైకోర్టే ఆదుకుందా ?

దీక్ష విషయంలో కవితకు చిత్తశుద్ది ఉందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి;

Update: 2025-08-05 10:27 GMT
Kalvakuntla Kavitha

నిజంగా కల్వకుంట్ల కవితను హైకోర్టే ఆదుకున్నది. లేకపోతే 72 గంటల దీక్షచేసి కవిత ఏమైపోయేవారో. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు(BC Reservations) మద్దతుగా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఢిల్లీ(Delhi)లో ఈనెల 5,6,7 తేదీల్లో నిరసనలు చేయాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు ప్రత్యేక రైలులో 1400 మంది సోమవారం చర్లపల్లి స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరరు. వీళ్ళంతా ఈరోజు సాయంత్రం ఢిల్లీలో దిగి రేపు అంటే బుధవారం ఉదయం నుండి సాయంత్రంవరకు జంతర్ మంతర్ లో పెద్దఎత్తున ధర్నాచేస్తారు. కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ అలా ప్రకటించిందో లేదో వెంటనే కవిత రంగంలోకి దిగేశారు. బీసీల రిజర్వేషన్ క్రెడిట్ మొత్తం ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వమే కొట్టేస్తోందన్న ఆందోళనతో కవిత(Kavitha) 72 గంటల దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.

నిజానికి కవిత దీక్షచేయాలంటే చేయాల్సింది హైదరాబాదులో కాదు ఢిల్లీలో. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం పంపిన బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును పక్కనపెట్టేసింది నరేంద్రమోదీ ప్రభుత్వం. కాబట్టి రిజర్వేషన్లకు మద్దతుగా ఎవరన్నా ఆందోళనలు చేయాలన్నా, దీక్షలు చేయాలన్నా ఢిల్లీలోనే చేయాలి. అయితే వెరైటీగా కవిత మాత్రం 72 గంటల దీక్షను హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర చేయటానికి రెడీ అయ్యారు. తనదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాము, నిరసన వ్యక్తంచేస్తాము పర్మీషన్ ఇవ్వమంటే పోలీసులు ఇస్తారా ? కవిత తెలివి ఇక్కడే బయటపడింది.

సరే కవిత పిటీషన్ను పరిశీలించిన హైకోర్టు 72 గంటలు కుదరదు ఓ 6 గంటలు చేసుకోమని అనుమతి మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించింది. దానికి తగ్గట్లుగానే ఇందిరాపార్క్ దగ్గర ఉదయం మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటలకల్లా ముగిసిపోయింది. నిజంగానే దీక్ష విషయంలో కవితకు చిత్తశుద్ది ఉందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేస్తానంటే కోర్టు వద్దన్నది కాని తనింట్లో చేసుకుంటానంటే కోర్టు ఎందుకు వద్దంటుంది ? దీక్షకు పోలీసులు ఒప్పుకోకపోయినా కోర్టు అనుమతించకపోయినా తన ఇంట్లో అయినా సరే 72 గంటల దీక్ష చేసేది చేసేదే అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఆమె చెప్పినట్లుగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు కాని కోర్టు మాత్రం 6 గంటల పాటు దీక్షకు అనుమతిచ్చింది. కోర్టు అనుమతి ఇచ్చినట్లుగా ఇందిరాపార్క్ దగ్గర సాయంత్రం 4 గంటలకు ముగించిన దీక్షను కవిత మిగిలిన గంటలు ఇంట్లో చేయాలి కదా ? మరెందుకు చేయలేదు ? ఇక్కడే కవిత చిత్తశుద్ది మీద జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ నిజంగానే కోర్టు గనుక 72గంటల దీక్షకు అనుమతి ఇచ్చుంటే కవిత నిజంగానే అన్నిగంటలు దీక్ష చేసుండేవారేనా ? అనే అనుమానాలు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే 6 గంటల దీక్షకే ఆమె మొహం వాడిపోయినట్లయ్యింది. ఒకవేళ చేయలేకపోతే అప్పుడు కవిత పరిస్ధితి ఏమిటి అనేచర్చలు పెరిగిపోతున్నాయి. కాబట్టి దీక్షను 6 గంటలకు కుదించి హైకోర్టు కవితను ఆదుకున్నట్లు అనుకోవాలి.

Tags:    

Similar News