కాంగ్రెస్ ధర్నా బీసీల కోసం కాదా..!
కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతే కరువైందని ఎద్దేవా చేశారన్న బండిసంజయ్.;
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్‌మంతర్ కూడలిలో కాంగ్రెస్ చేస్తున్న ధర్నాపై కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండిసంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీల పేరు చెప్పి ముస్లింల రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్.. బీసీలను రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. బీసీలకు మాత్రమే 42 శాతం శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటే దానికి తాము మద్దతిస్తామని, కానీ బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చింది కామారెడ్డి డిక్షన్ కాదని, అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే అని విమర్శించారు. బీసీలకు 5శాతం పెంచి, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచే కుట్ర జరుగుతోందని, బీసీల ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతే కరువైందని ఎద్దేవా చేశారు.
‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామంటేనే మద్దతిస్తాం. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చలకు మేము సిద్ధం.. చర్చించడానికి ఎవరైనా సిద్ధమా. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా బీసీ వ్యక్తిని ప్రధానిగా చేశఆరా. ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల పరిపాలించిన కాంగ్రెస్ ఒక్కసారైనా బీసీని సీఎం చేసిందా? రాష్ట్ర కేబినెట్, నామినెటెడ్ పదవుల్లో బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? ఎంతమంది బీసీలకు ఎంపీ సీట్లు ఇచ్చారు?’’ అని ప్రశ్నలు గుప్పించారు. ‘‘బీజేపీ అలా కాదు.. 27 మంది బీసీలకు కేంద్ర క్యాబినెట్‌లో స్థానం కల్పించింది. అనేక రాష్ట్రాల్లో సీఎం పదవుల్లో బీసీలకు కూర్చోబెట్టింది. ఆ ఘనత బీజేపీ దక్కుతుంది. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ కాంగ్రెస్‌కు యూపీ, బెంగాల్, బీహార్ తరహాలో తెలంగాణలో కూడా కనుమరుగవడం తథ్యం’’ అని వ్యాఖ్యానించారు.