పర్యావరణ హితంగా రాఖీలు

గోమయం కాన్సెప్ట్ పరిచయమౌతోంది;

Update: 2025-08-09 10:49 GMT

అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగలో గోమయం కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. మన దేశంలో పండుగలకు ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ఆవులు ప్రకృతిలో భాగం. ఆవు మూత్రం, పేడతో కూడా రాఖీలను తయారు చేయవచ్చు. రాఖీ పండుగకు రెండు, మూడు నెలల ముందే ఈ రాఖీలను తయారు చేస్తారు.

ఎర్రమట్టి, గోమూత్రం, పేడ కలిపి రాఖీలను తయారు చేస్తారు. వర్షాకాలంలో రైతులకు అవసరమయ్యే విత్తనాలను కూడా దీనిలో కలుపుతారు. దీన్నిబాగా మిశ్రమంగా చేసి బిళ్లలు చేస్తారు. బిళ్లలు చేయడానికి మిశ్రమాన్ని చిన్న చిన్న మూతలలో నింపుతారు. వాటిని ఎండలో ఆరబెడతారు. వర్షాకాలానికి ముందే ఈ బిళ్లలను తయారుచేసి ఎండలో ఆరబెడతారు. ప్రతీ బిళ్ల చుట్టూ దారం కట్టి రాఖీ చేస్తారు. రాఖీ పండుగ పూర్తి కాగానే సాధారణంగా రాఖీలను ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తుంటారు. పవిత్ర బంధాన్ని సూచించే రాఖీలను ఇంటి పెరట్లో వేస్తే రాఖీలో ఉన్న విత్తనాలే మొక్కలుగా మారుతాయి. అన్నా చెల్లెళ్ల బంధం పదికాలాల పాటు ఈ మొక్కలు నిలుస్తాయి. వ్యవసాయ క్షేత్రాలలో ఈ విత్తనాలను చల్లి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలంగాణ గోశాల ఫెడరేషన్ తెలిపింది. ఫెడరేషన్ అధ్యక్షులు మహేశ్ కుమార్ అగర్వాల్ ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడుతూ ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు పర్యావరణ హిత రాఖీలను పరిచయం చేస్తున్నట్టు, గోవు ప్రాముఖ్యత వివరిస్తున్నట్టు’’ చెప్పారు. శ్రావణ పౌర్ణమి రోజు వచ్చే రాఖీ పండుగను పూర్వం పర్యావరణహితంగా జరుపుకునే వారని ఆయన తెలిపారు. వివిధ రకాల విత్తనాలు, వివిధ మొక్కల పూలు, చెట్ల ఉత్పత్తులను మిశ్రమంలో కలిపేవారు. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది అని అగర్వాల్ అన్నారు.

‘‘భారతదేశంలో ఆవులను పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అనేక పండుగలలో వీటిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ముఖ్యంగా, గోపాష్టమి పండుగనాడు ఆవులను పూజించడం ఒక ప్రధాన సంప్రదాయం. ఆ రోజున, ఆవులు మరియు ఎద్దులను అలంకరించి, పూజించి, ఆహారం పెడతారు’‘అని ఆయన తెలిపారు.

సంక్రాంతి

సంక్రాంతిలో ఎద్దులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ ప్రకృతికి, ఎద్దులకు చాలా దగ్గరి సంబంధం ఉంది.

సంక్రాంతిని పంటల పండుగ అంటారు. ఈ పండుగలో రైతులు ఎద్దులను పూజిస్తారు. ఎద్దులను అలంకరించి, వాటితో ఊరేగింపులు, పందాలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ ప్రకృతిని, పశువులను గౌరవించే పండుగగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ పంటలు చేతికొచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను రైతులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

‘‘గోరేహబ్బా పండుగ కూడా ఆవులతో ముడిపడి ఉంది. ఇది దీపావళి తర్వాత వస్తుంది కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. ఈ పండుగలో, ప్రజలు ఆవు పేడను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు’’అని ఆయన తెలిపారు.

గౌ గ్రామ మహోత్సవ్:

ఆవుల పండుగ అయిన గౌ గ్రామ మహోత్సవ్ మహారాష్ట్రలో జరుపుకుంటారు. ఈ పండుగలో, ఆవులను పూజిస్తారు మరియు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు,ఇది యూరోపియన్ ఆల్ప్స్ పండుగ, ఇక్కడ ఇంటికి తిరిగి వచ్చే ఆవులను అలంకరించి, ఊరేగింపుగా తీసుకెళతారు.

నైషి ఆరాధన:

అరుణాచల్ ప్రదేశ్ లోని నైషి ప్రజలు జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగలు ఆవుల పవిత్రతను, వాటి ప్రాముఖ్యతను, మరియు రైతులతో వాటికున్న సంబంధాన్ని తెలియజేస్తాయి

ముఖ్యంగా, గోపాష్టమి పండుగనాడు ఆవులను పూజించడం ఒక ప్రధాన సంప్రదాయం. ఈ రోజున, ఆవులు మరియు ఎద్దులను అలంకరించి, పూజించి, ఆహారం పెడతారు.

ఇంకా, గోరేహబ్బా పండుగ కూడా ఆవులతో ముడిపడి ఉంది. ఇది దీపావళి తర్వాత వస్తుంది మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. ఈ పండుగలో, ప్రజలు ఆవు పేడను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ పండుగలు ఆవుల పవిత్రతను, వాటి ప్రాముఖ్యతను, మరియు రైతులతో వాటికున్న సంబంధాన్ని తెలియజేస్తాయి

Tags:    

Similar News