ఆదిలాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

అతివేగంగా వచ్చిన కారు మూలమలుపులో పల్టీ కొట్టడంతో ...

Update: 2025-12-10 10:00 GMT

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్‌ మండలం తరోడ సమీపంలో బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను ఆదిలాబాద్‌లోని జైజవాన్‌ నగర్‌, లక్ష్మీనగర్‌ వాసులుగా గుర్తించారు పోలీసులు. మహారాష్ట్రకు మేస్త్రీ పనికి వెళ్లి కారులో తిరుగు ప్రయాణంలో ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ మార్చురీకి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం ఓ మూల మలుపులో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న షేక్ మొహినుద్దీన్, షేక్ మొహిన్, కదం కీర్తి సార్ స్పాట్ లోనే చనిపోయారు.

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు సంభవించి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణం అని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ ఏడో తేదీన నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. వారి మరణానికి కూడా అతివేగకమే కారణమైంది.  అతివేగానికి మంచుతోడవటంతో ఎదురుగా ఉన్న దృశ్యం కనిపించకపోవడంతో వాహనం డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీపతి అజిత్ రెడ్డి, పప్పుల శివమణి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

మరో ఘటనలో కీసర నుంచి తార్నాక వెళుతున్న కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో మల్కాజ్‌గిరికి చెందిన హర్షవర్దన్ చనిపోయాడు. నవంబర్ 3వ తేదీన రంగారెడ్డి చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఆర్టీసి బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. తాండూర్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.

Tags:    

Similar News