కాంగ్రెస్ సర్కార్‌పై బండి సంజయ్ సెటైర్లు
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. అబద్ధాలు ఆడటంతో ఈ పార్టీకి ఆస్కార్ ఇవ్వొచ్చంటూ సెటైర్లు వేశారు. అధికారం పొందడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఈ పార్టీ అబ్ధాలనే ఆశ్రయిస్తుందని చురకలంటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్.. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించిన విమర్శలు వెల్లువెత్తించారు. వాజ్ పేయి.. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని, పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారని చెప్పారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నయో అన్నదైనా రాహుల్ గాంధీకి తెలుసా? అని ప్రశ్నించారు. ముందుగా వాటిని సందర్శించాలని రాహుల్‌కు సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌పై కూడా విమర్శలు చేశారు. ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లి రేవంత్ ఎందుకు నివాళులు అర్పించలేదు? అని ప్రశ్నించారు. విగ్రహం ఎవరు పెట్టారని కాదు.. అది అంబేద్కర్ విగ్రహమా కాదా? అని ప్రశ్నించారు.
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ ఒక్కటేనని బండి అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అబద్ధాలతో పాలన కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ కారణంగానే సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రకు షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కక్ష రాజకీయాలు పెరిగిపోతున్నాయని, ఈ కక్ష సాధింపులు ఏంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. అంబేద్కర్‌ను అవమానించే రాహుల్ గాంధీ.. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్ష గురించి మాట్లాడుతున్నారని, అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమీ ఉండదంటూ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి అసలు అంబేద్కర్ అంటే గౌరవం, ప్రేమ ఉన్నాయా? అంబేద్కర్‌పై అభమానం అనేది రవ్వంత ఉన్నా.. ఎన్‌టీఆర్ ఘాట్‌లోఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎందుు నివాళులు అర్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి దళితుల మద్దతు ఉందని, వారి మద్దతుతోనే బీజేపీ వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దళితుల విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిందని విమర్శించారు. ఆనాడు కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహ పనులను మధ్యలోనే నిలిపివేస్తే వాటిని బీజేపీ వార్నింగ్ తర్వాతే పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు బండి సంజయ్.