BJP | పొత్తులపై క్లారిటి ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు

తమపార్టీకి ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు.;

Update: 2025-08-03 10:36 GMT
Telangana BJP president N Ramachandra Rao

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు తేల్చిచెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టంగా ప్రకటించారు. ఒక టీవీ ఛానల్ తో మాట్లాడిన రావు రాబోయే ఎన్నికల్లో తమపార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందన్నారు. తమపార్టీకి ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ(Telangana BJP)నే అని నారపరాజు ఆశాభావం వ్యక్తంచేశారు. తమతో పొత్తు పెట్టుకోవాలని ఏ పార్టీ అయినా ఆలోచిస్తుండచ్చు కాని తమకు మాత్రం పొత్తులపై ఎలాంటి ఆలోచనలేదన్నారు. ఏపీ(AP) కూటమి ప్రభుత్వంలో టీడీపీ(TDP), జనసేన(Janasena)తో కలిసి బీజేపీ ఉన్నంత మాత్రాన తెలంగాణలో పై పార్టీలతో కలవాలని ఏమీ లేదన్నారు.

తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలు మొదలు అసెంబ్లీ ఎన్నికలవరకు బీజేపీ ఒంటరిగానే పోటీచేయటానికి రెడీ అవుతోందన్నారు. క్షేత్రస్ధాయిలో పార్టీని బలోపేతంచేసేందుకు చర్యలు మొదలైనట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలంతా బీజేపీని మాత్రమే చూస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనను, ఎనుముల రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత జనాలంతా బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుటుందనే మూడ్ లోకి వచ్చేసినట్లు చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుగురించి మాట్లాడుతు ప్రాజెక్టుల నిర్మాణాలకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపేరుతో అవినీతికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపేరుతో కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఇదే విషయాన్ని విచారణ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ తనరిపోర్టులో పొందుపరిచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నారపరాజు గుర్తుచేశారు. అలాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై మాట్లాడుతు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటానికి తమపార్టీ వ్యతిరేకం కాదన్నారు. కాకపోతే మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోటాలో ముస్లింలను చేర్చటంపైనే తమపార్టీ అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నట్లు రామచంద్రరావు స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నంతవరకు తమపార్టీ రిజర్వేషన్లను వ్యతిరేకించటం ఖాయమన్నారు. అందుకనే తమపార్టీ లైనును స్పష్టంగా చెప్పిన తాము రిజర్వేషన్ల క్యాటగిరి నుండి ముస్లింలను తొలగించమని డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

Tags:    

Similar News