Congress dharna | కాంగ్రెస్ ధర్నా గ్రాండ్ సక్సెస్

జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో సుమారు 200 మంది కూర్చునేలా వేదికను ఏర్పాటుచేశారు;

Update: 2025-08-06 13:52 GMT
Congress Dharna at Jantar Mantar

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలన్న డిమాండ్ తో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ధర్నా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth), పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh) తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు, పార్టీలోని సీనియర్ నేతలు పాల్గొన్నారు. పార్టీ నేతలతో పాటు మిత్రపక్షాలు డీఎంకే, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన పార్టీల నుండి ఎంపీలు కనిమొళి(Kanimozhi), గౌరవ్ గొగోయ్(Gaurav Gogoi), జ్యోతిమణి సెన్నిమలై తదితరులు పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు.

జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో సుమారు 200 మంది కూర్చునేలా వేదికను ఏర్పాటుచేశారు. అలాగే మరో 1500 మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటుచేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ కు వెళ్ళే దారిలో ధర్నాకు సంబందించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు భారీగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు ప్రధానమోది, బీజేపీ నేతలు రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని తెలంగాణలోని బలహీనవర్గాకు అన్యాయం చేస్తున్నట్లు మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపుమంట ఎందుకని నిలదీశారు. గల్లీల్లో ఉండలేక ఢిల్లీలోనే రిజర్వేషన్ల విషయం తేల్చుకునేందుకే వచ్చినట్లు రేవంత్ చెప్పారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఎలాగైనా సాధించి తీరుతామన్నారు. బిల్లుకు మద్దతిస్తారా లేకపోతే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపాలా అని నేరుగా మోదీనే రేవంత్ తేల్చుకోమన్నారు. తమ ఆలోచనలు, బిల్లులను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారని మోదీని రేవంత్ నిలదీశారు. బలహీనవర్గాలకు న్యాయంచేసే ఆలోచన మోదీకి లేదని, ప్రధానమంత్రి మోచేతినీళ్ళు తాగే బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావుకు ఏమైందని రేవంత్ మండిపడ్డారు. ఈ ధర్నాకు ముందుగా ప్రచారం జరిగినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి హాజరుకాలేదు.

Tags:    

Similar News