హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల.. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు..
తమకు ఓట్లు లేనందున ఈ స్థానిక ఎన్నికకు బీఆర్ఎస్ దూరం పాటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.;
By : The Federal
Update: 2025-03-29 12:33 GMT

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. ఇందులో మజిలీస్ పార్టీకి తమ పూర్తి మద్దతు పలికింది. ఎంఐఎంతో పొత్తులో భాగంగానే ఈ పోటీ నుంచి కాంగ్రెస్ తప్పుకుని.. ఎంఐఎం పార్టీకి ఈ సీటును వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 115 ఓట్లు ఉండగా వాటిలో ఎంఐఎంకు పడేవే దాదాపు 65 ఓట్లు ఉన్నాయని, అందువల్లే ఆ పార్టీకి ఈ స్థానం వదిలి పెట్టాలని కాంగ్రెస్ నిశ్చయించుకుంది. కాగా ఇదే క్రమంలో తమకు ఓట్లు లేనందున ఈ స్థానిక ఎన్నికకు బీఆర్ఎస్ దూరం పాటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.