టాలీవుడ్ తారల పేర్లతో నకిలీ ఓటరు కార్డులపై ఈసీ సీరియస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కలకలం రేగింది. సమంత, తమన్నా, రకుల్ పేర్లతో ఫేక్ ఓటర్ ఐడీలు...ఎన్నికల కమిషన్ సీరియస్...

Update: 2025-10-17 04:49 GMT
సినీనటీమణుల పేర్లతో నకిలీ ఎపిక్ కార్డులు

సినీ తారలు సమంత రుతుప్రభు, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్(Samantha, Tamannaah, Rakul Preet)...టాలీవుడ్ ప్రముఖ తారలైన(Tollywood stars) వీరి పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో (social media)వైరల్ గా మారాయి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల(Jubilee Hills Assembly bypoll) నేపథ్యంలో ఈ ముగ్గురు తారల పేరుతో నకిలీ ఓటరు కార్డులను(Fake voter IDs) తయారు చేసి కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.


బీఆర్ఎస్ నేతల ఆందోళన

నిజమైన ఓటర్ల ఎపిక్ నంబర్లతో పాటు నటీమణుల చిత్రాలను కూడా ఈ కార్డుల్లో చూపించారు. మరో వైపు ఈ ముగ్గురు సినీతారలకు ఒకే నివాస చిరునామా పెట్టారు.తెలుగు సినీతారల నకిలీ ఓటరు ఐడి కార్డులు జూబ్లీహిల్స్‌లో ఆన్‌లైన్‌లో నవంబరు 11వతేదీన కనిపించాయి. దీంతో ఎన్నికల కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్నికల అధికారులు తప్పుడు సమాచార ప్రచారాలకు లింక్‌లను పరిశీలిస్తున్నారు.దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులకు ఎన్నికల అధికారి ఫిర్యాదు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో సినీతారల పేర్లు, ఫొటోలతో నకిలీ ఓటరుకార్డులు సోషల్ మీడియాలో వెలుగుచూసిన వ్యవహారాన్ని ఎన్నికల అధికారులు తీవ్రంగా పరిగణించారు. జూబ్లీహిల్స్ సహాయ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ యహియా కమల్ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సినీనటీమణుల పేర్లతో నకిలీ ఎపిక్ కార్డులు


మధురానగర్ పోలీసుల దర్యాప్తు

సినీతారల పేర్లు, వారి ఫొటొలతో తప్పుడు ఎపిక్ కార్డులు తయారు చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని యహియా కమల్ పోలీసులను కోరారు. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 336(4), 353(1)(సి) ల ప్రకారం క్రైం నెంబరు 686/2025 తో మధురా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేయవద్దు : ఎన్నికల కమిషన్
తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను తప్పు దారి పట్టించే లా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని అధికారులు చెప్పారు. ఎలాంటి నకిలీ సమాచారం లేదా తప్పుడు డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో పంచుకోకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మధురానగర్ పోలీసులు కేసును విచారిస్తూ, నకిలీ ఓటరు కార్డుల వెనక ఉన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.


Tags:    

Similar News