42 శాతం బిసి రిజర్వేషన్ల పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు...
రేవంత్ ప్రభుత్వానికి షాక్
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో వెనకబడిన కులాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం మీద ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ (SLP) పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు వేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ల ధర్మాసనం ఈ ఉత్తర్వు లు జారీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయంతో నిమిత్తం లేకుండా పిటిషన్ సత్తాను బట్టి మెయిన్ పిటిషన్ మీద విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.
ఒబిసిలకు 42 శాతం రిజర్వేషన్లు (సెప్టెంబర్ 27 ఉత్తర్వులు) ప్రకటించడంతో ఎస్ సి, ఎస్ టి, ఒబిసిల రిజర్వేసన్లు 67 శాతానికి పెరిగాయి. దీనిని రెడ్డి జాగృతి అనే సంస్థకు చెందిన బుత్తెంగాని మాధవరెడ్డి తదితరులు హైకోర్టులో సవాల్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రటిస్తూ విడుదల చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు (జీవొ నెంబర్ 9) కొట్టివేయాలని కోరారు.దీనితో హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అపరేష్ కుమార్, జస్టిస్ జిఎం మొహియుద్ధీన్ ల డివిజన్ బెంచ్ అక్టోబర్ 9న ఈ రిజర్వేషన్ల పెంపు జీవో మీద స్టేవిధిస్తూ పిటిషన్ల ను విచారించేందుకు స్వీకరించింది. ఈ స్టే ఉత్తర్వులనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
తీరా లోక ల్ ఎన్నికలు వచ్చే దాకా రిజర్వేషన్ల ఉత్తర్వులు ఎందుకు జారీ చేయాలేదని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ ఆలస్యానికి కారణం, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడమేనని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి చెప్పారు.గవర్నర్ బిల్లు కు ఆమోదం తెలిపే విషయం లో తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు విధించిన గడువు ను దృష్టిలో పెట్టుకుని బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా భావించి 42 శాతం ఉత్వర్వులు జారీచేశారని ఆయన కోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం బిల్లు చట్టం అయిందని, చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన వివరించారు.
సరైన లెక్క సమాచారం ఉంటే రిజర్వేషన్లు 50 శాతం మించవచ్చని గతంలో ఒక కేసులో (K. Krishna Murthy (Dr.) & Ors. v. Union of India and Vikas Kishanrao Gawali) కోర్టు సూచించందని, తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వేజరిపి వెనకబడిన కులాలు లెక్కలు సేకరించి 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించిందని సింఘ్వి వాదించారు.
అయితే, కోర్టు వాటితో సంతృప్తి చెందలేదు. హైకోర్టు ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని న్యాయమూర్తులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టి వేశారు.