హైదరాబాద్ లో పరువు హత్య
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిపించి యువకుడి హత్య
హైదరాబాద్ లో మరో పరువు హత్య జరిగింది. పటాన్ చెరుకు చెందిన శివ బీ టెక్ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో భగ్ర ప్రేమికులుగానే ఉండిపోయారు. ఎలాగైనా సరే యువకుడిని వదిలించుకోవాలని అమ్మాయి తల్లి, దండ్రులు అనుకున్నారు. ఇందులో భాగంగానే యువతి తల్లి, దండ్రులు వివాహం గురించి మాట్లాడాలని చెప్పి శివను బుధవారం ఇంటికి పిలిపించారు. పెళ్లి చేస్తామని నమ్మించడంతో హుషారుగా యువతి ఇంటికి చేరుకున్నాడు శివ.
ఇంట్లోకి రాగానే మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాల పాలై శివ ఇంట్లోనే మరణించాడు. పెళ్లి చేస్తామని నమ్మించడంతో శివ యువతి ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రికెట్ బ్యాట్ తో శివ తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన పటాన్ చెరులో కలకలం రేపింది. శివ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.