వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం.. స్పష్టం చేసిన పొంగులేటి

పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-11-05 07:18 GMT

పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండేలా చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అనేక అంవాలను పరిగణనలోకి తీసుకుని అమలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపి నుంచి ఇళ్లు అందించే వరకు కూడా అన్నీ చాలా పాదర్శకంగా జరుగుతాయిన చెప్పారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, ఆ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత వస్తుందని ఆయన వివరించారు. ఈ ఇళ్లను విడతల వారీగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుందని ఆయన తెలిపారు. ఇదే అంశంపై ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మరోసారి మాట్లాడారు. ఈ సందర్భంగానే ఈ పథకం అమలు విషయంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. చాలా మంది రాజకీయ లబ్ధి కోసం పేదలకు మంచి చేసే ఈ పథకాన్ని అనుమానిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని, ప్రతి పేద వ్యక్తికి ఇందిరమ్మ ఇళ్లు లభించి తీరుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇదిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించామని, వాటిలో పూర్తియన వాటిని పూర్తయినట్లు లబ్ధిదారులకు కేటాయిస్తూ వెళ్తామని వివరించారు.

రాజకీయాలకు తావులేకుండా అమలు

‘‘ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తాం. ఇందులో ప్రతి లబ్ధిదారుడికి ఇంటిని అందిస్తాం. సదరు లబ్ధిదారుడు ఏ పార్టీకి చెందిన వారైనా ఇంటిని అందిస్తాం. అందులో సందేహం లేదు. తమ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లంటూ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. కానీ మా ప్రభుత్వం అలాదున’’ అని వివరించారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇంటిని రేషన్ కార్డులేని వారికి కూడ అందిస్తామని పొంగులేటి చెప్పారు. ‘రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడదతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఈ విడదతలో పేదలు, నిరుపేదలను గ్రూప్‌లుగా పరిశలించి ఇళ్లు మంజూరు చేస్తాం. అతి త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా ప్రారంభిస్తాం. రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డు ప్రామాణికంగా ఇళ్ల అందుబాటు పర్క్రియన నడుస్తుంది’’ అని వివరించారు. గతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పొంగులేటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అవేంటుంటే..

దీపావళి పండగ కానుకగా ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా ప్రారంభించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీపావళి పండగ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారాయన. దీపావళి రోజు అమావాస్య కావడంతో ఆతర్వాత మంచి రోజు చూసుకుని గృహాల నిర్మాణానికి శ్రీకారం చుడతామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలను అందించనున్నామని ఆయన అన్నారు.

Tags:    

Similar News