బీజేపీ,బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయి

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తెలంగాణలో యూరియా కొరత వచ్చిందని మంత్రి పొన్నం ఆరోపించారు.;

Update: 2025-09-08 10:44 GMT

బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ కుమ్మక్కై తమ ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత వచ్చిందని అన్నారు.బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుకి ఎరువుల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. ఆయనకు రాజకీయ విమర్శలు తప్పా, రైతుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. యూరియా కోసం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా..? అని నిలదీశారు.రాంచందర్‌రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.యూరియా సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున పోరుబాట పడుతామని మంత్రి పొన్నం హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులు, ఎంపీలు యూరియాపై కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలసి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. యూరియా ఉత్పత్తి, సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పుకొచ్చారు.గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.


రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు పాజిటివ్‌గా ఉన్నారని చెప్పిన పొన్నం,రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, దాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్‌లు నిరసనలు అంటూ రైతచులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు.రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆపేశారని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు యూరియా కొరతకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు .యూరియా సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.ఎరువుల అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి స్పందించాలని కోరారు.
Tags:    

Similar News