ఇద్దరు పిల్లలతో సంపులో దూకిన తల్లి

బాచుపల్లిలో విషాదం... పిల్లలు మృత్యువాత;

Update: 2025-08-20 12:32 GMT

బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి సంపులో దూకింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో  బయటపడితే, 8 నెలల పసికందు, మూడేళ్ల బాబు చనిపోయారు.  తల్లిని మాత్రం స్థానికులు రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఆమె సుసైడ్ కు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణ మెదక్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం 30 ఏళ్ల లక్ష్మి తన ఇద్దరు పిలలతో కల్సి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తొలుత తన ఇద్దరు పిల్లలను సంపులో తోసేసింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకునే లోపు లక్ష్మి కూడా సంపులో దూకేసింది. స్థానికులు బాధితురాలిని రక్షించినప్పటికీ ఆమె ఇద్దరు పిల్లలు మాత్రం సంపులోనే ఊపిరాడక చనిపోయారు. సంపులో నీళ్లు తక్కువగా ఉండటంతో లక్ష్మి ప్రాణాలతో బయటపడింది. కుటుంబ తగాదాలే ఘటనకు  దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News