భక్తులతో కిట కిటలాడిన శైవ క్షేత్రాలు

కార్తిక సోమవారం కావడంతో పోటెత్తిన వేములవాడ రాజన్న శైవక్షేత్రం

Update: 2025-11-10 11:26 GMT
special day for shaivites

మహాశివుడిని ఏడాది పొడవున కొలిచే భక్తుల కంటే ఈ కార్తీకమాసం నెల రోజులు పూజించే భక్తుల సంఖ్యే ఎక్కువ. కార్తిక మాసం మూడో సోమవారం పురస్కరించుకుని తెలంగాణలోని అన్ని శైవ క్షేత్రాలు కిక్కిరిసిపోయాయి. ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలోని రాజన్నదేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.రాజన్న మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.

ఎముకలు కొలికే చలిని లెక్కచేయకుండా

దక్షిణ కాశీగా పిలవబడుతున్న వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో భక్తులు పోటెత్తారు

తెల్లవారుజామున ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా, వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రం వద్ద స్నానం ఆచరించారు. ఈ స్నానం కేవలం ఆచారం మాత్రమే కాదు, మానసిక ఉపశమనం కూడా అని వేదపండితులు చెబుతున్నారు.తొలుత మహాశివుడు సన్నిధికి చేరుకున్న భక్తులు తెల్లవారుజామునుంచే క్యూలైన్ లో నిల్చున్నారు.  తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఒక్కొక్క దీపం వెనుక ఒక్కో భక్తురాలి నోము, మొక్కు దాగి ఉంది. ఈ దృశ్యం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక దీపాలు వెలిగించి ఆలయం వైపు బయలుదేరిన భక్తులతో వీధులు కిక్కిరిసిపోయాయి.

భోళా శంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అని భక్తులు విశ్వసిస్తారు. అందునా కార్తీక సోమవారం అంటే మహా ఇష్టం అని భక్తుల నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులను పూజించడం వల్ల పాపాలు నశించి మోక్ష ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ మాసంలో చేసే దాన ధర్మాలకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది.

Tags:    

Similar News