కోతులతో అటవీ సమీప గ్రామాలన్నీ ఇపుడు కోతుల కల్లోల ప్రాంతాలే...

అనేక పట్టాణలు పల్లెల్లో ప్రజలు భయభ్రాంతులు. పంటలు, ధాన్యం పెద్ద ఎత్తున నష్టం

Update: 2025-11-10 06:12 GMT

కోతుల సమస్య తెలంగాణ రాష్ట్రంలోని చాలా పట్టణాలు, గ్రామాలలో ప్రధాన సమస్యగా మారింది. కోతుల దాడిలో ప్రజలు గాయపడటం, రైతులు పంటలను రక్షించుకోవటం, కనీసం ఆరు బయట ఉతికిన బట్టలు ఆరబెట్టుకోటం కూడా పరిష్కారం దొరకని పరిస్థితి కోతుల సమస్యలో నెలకొని ఉంది.

మంకీ గన్స్, గులేరులు (sling shots), సింహం బొమ్మలను ప్రదర్శించటం మరియు ఇతర ప్రయోగాలు సైతం కోతుల సమస్యకు పూర్తి పరిష్కారం చూపటం లేదు. కోతుల దాడుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డ సంఘటనలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్నాయి. కోతుల సమస్య మూలంగా కొన్ని ప్రాంతాలలోని రైతు లాభదాయక పంటలు ఐన కూరగాయలను, కొన్ని వాణిజ్య పంటలను సాగు చేసే పరిస్థితి లేదు. కోతుల గుంపుల దాడితో రైతులు పంట నష్టం వాళ్ళ ఆదాయంను సైతం కోల్పోతున్నారు. పూర్వం గులేరలు ఆటవస్తువులుగా వాడే వారు. జాతరల్లో పండగలపుడు మాత్రమే వీటికి విక్రయించే వారు. ఇపుడు వీటిని ఆమ్మే వాళ్లు ఊరూర కనబడుతున్నారు. కోతులను తరిమేందుకు వాటిని తప్పకుండా వాడాల్సి వస్తున్నది. ఒక్కొక్క గులారే ఖరీదు రు. 40 నుంచి 50 దాకా ఉంటున్నది.
కోతుల సమస్య పరిష్కారంపై గత బి.ఆర్. ఎస్. (BRS) ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసిన ఎలాంటి పరిష్కారం చూపించలేకుండపోయింది.2021 డిసెంబర్ లో అటవీ, పశుసంవర్థక, వ్యవసాయ శాఖ అధికారులతో ఈ కమిటీ వేశారు. ఎన్నికోతులున్నాయి, కోతుల బెదడ ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణోపాయాలు సూచించడం ఈ కమిటీ లక్ష్యం.  కోతులపై ఉన్న ఆధ్యాత్మిక నమ్మకంతో ప్రజలు వాటికీ హాని చేసే ధైర్యం చేయటం లేదు. 
రాష్ట్రంలోని యాదాద్రి- భోనగిరి జిల్లాలో కోతుల సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఐదు లక్షల పదిహేడు వేల కోతులు ఉన్నవి. ఇది జిల్లా జనాభా లో 60 శాతం. దాదాపు ౩౦ కోతులు ఒక గుంపుగా సంచరిస్తున్నవి. జిల్లాలోని రాజాపేట, మోత్కూర్ మండలాలలో జనాభాను మించిన కోతులు ఉన్నటు అధికారులు సైతం నిర్ధారించారు. ఎంత పంట నష్టం చేసయతున్నాయనే దాని మీద సరైన లెక్కలు లేవు. అయితే కొన్ని ప్రాంతాలలో దాదాపు 30 శాతం పంటని కోతులు ధ్వంసం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

గులేరాల విక్రయం

రాష్ట్రంలోని యాదాద్రి- భోనగిరి జిల్లాలో కోతుల సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఐదు లక్షల పదిహేడు వేల కోతులు ఉన్నవి. ఇది జిల్లా జనాభా లో 60 శాతం. దాదాపు ౩౦ కోతులు ఒక గుంపుగా సంచరిస్తున్నవి. జిల్లాలోని రాజాపేట, మోత్కూర్ మండలాలలో జనాభా మించిన కోతులు ఉన్నటు అధికారులు సైతం నిర్ధారించారు.
గతేడాది యాదాద్రి- భోనగిరి జిల్లాలో 2,429 మంది కోతుల దాడిలో గాయపడ్డారు. ఈ సంఖ్య ప్రస్తుత సంవత్సరంలో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు నమోదు ఐన కోతుల దాడిలో గాయపడ్డవారి సంఖ్యను చూస్తే అర్ధం అవుతుంది. మనుషులనే కాదు జీవాల మీద కూడా కోతుల గుంపు దాడి చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని శోభనాద్రిగూడెంలో కోతుల దాడిలో ౩౦ మేకపిల్లను చనిపోయాయి.
కోతులను తరిమివేయుటకు కొంత మంది రైతులు కొండెంగలను కూడా పెంచుతున్నారు. కేతేపల్లికి చెందిన ఒక రైతు 6,000 రూపాయలు వెచ్చించి కొండెగను కొనుగోలు చేసాడు. కోతుల సమస్య నుంచి బయట పడేందుకు ప్రజలు చేయని ప్రయత్నం లేదు అనటం అతిశయోక్తి కాదు.
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీ కోతుల సమస్య పరిష్కరం కొరకు రెండు కొండెంగలను కొనుగోలు చేసి గ్రామంలో తిప్పుతున్నారు. 

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంపై చెందిన రైతు శిగ రామచంద్రు మాట్లాడుతూ కోతుల బెడద వల్ల వేరుశనగ కంది ఇతర ఆహార పంటలు సాగుచేయటం తనకు వీలు పడటంలేదు అని వాపోయాడు. వారి సాగుచేయటం తప్ప తనకు వేరే మార్గం లేదని అయన అన్నారు.
అర్వపల్లికి చెందిన కిరాణా షాప్ యజమాని కె మధు మధు మాట్లాడుతూ కోతుల నుంచి సరకులను కాపాడుకోవటం కోసం తన షాప్ ముందు భాగంకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కోతుల నుంచి సరకులను కాపాడుకోవటం పెద్ద సవాలుగా , మారిందని అయన అన్నారు.
ఉత్తమ రైతు ‘ఫార్మర్స్ ఫ్యూచర్ ఆర్గనైజషన్’ కన్వీనర్ రూపాని రమేష్ మాట్లాడుతూ వివిధ కోతులకు ఆవాసానికి అనువైన ప్రాంతాలు గుర్తించి ప్రభుత్వం అక్కడ పండ్ల చెట్లను పెంచాలి. దీనివల్ల కోతులు ఆహారం కోసం జనావాసాలలోకి రావటం అరికట్ట వచ్చు. తాత్కాలిక చర్యలు ఎన్ని తీసుకున్నా సమస్య కు శాశ్విత పరిష్కారం లభించదు అని అయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News