‘ఎస్పీ బాలు’ వాయిస్ పున: సృష్టిపై నిర్మాతలకు నోటీస్

దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం వాయిస్ ను ఓ సినిమాలో ఏఐ సాంకేతికతతో ఉపయోగించడంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ నిర్మాతలకు లీగల్ నోటీస్ పంపారు.

Update: 2024-02-20 11:29 GMT

దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి తన తండ్రి గాత్రాన్ని అనుచితంగా పున: నిర్మించినందుకు తెలుగు సినిమా ‘ కీడాకోలా’ నిర్మాతలకు లీగల్ నోటీస్ పంపారు.

భారత చలన చిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలుకు ఉన్న ఫాలోయింగే వేరు. అలాంటి వ్యక్తి మరణాంతరం ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి తన స్వరాన్ని పున: సృష్టించేందుకు కూడా మేము ఇష్టపడతాం. కానీ అలాంటి పనులు కుటుంబ సభ్యులకు కూడా తెలపకుండా చేయడం వల్ల తీవ్రంగా నిరాశ చెందామని, ఈ విషయంపై సంగీత దర్శకుడు వివేక్ సాగర్ కి కూడా లీగల్ నోటీసులు పంపామని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు.

నవంబర్ 23, 2023లో యూట్యూబ్ లో ప్రసారమైన ఒక ఇంటర్వ్యలో నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరాన్ని పున: సృష్టించడానికి ఎస్పీబీఐ ని ఉపయోగించినట్లు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ స్వయంగా అంగీకరించాడు. దీనివల్ల బాలు కుటుంబం తీవ్రంగా షాక్ గురైనట్లు ప్రకటించింది.

రెండు కారణాల వల్ల ఎస్పీబీ కుటుంబం తీవ్రంగా మనోవేదనకు గురైంది. మొదటిది కుటుంబ అనుమతి లేకుండా ఏఐ ఉపయోగించడం, వినోద పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ స్వరాన్ని అనుసరిస్తే తమ భవిష్యత్ పై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మా స్వరమే మా ఆస్తి అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News