Sankranti | ప్రైవేటు ట్రావెల్స్‌పై 300 కేసులు

ప్రభుత్వం ఆదేశాలను తుంగలోతొక్కి టికెట్ రేట్లు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్. చెక్ పెట్టిన పోలీసులు.;

Update: 2025-01-13 12:57 GMT

తెలంగాణలోని ప్రైవేట్ ట్రావెల్స్‌కు రాష్ట్ర పోలీసులు శాఖ సంక్రాంతి స్పెషల్‌ గిఫ్ట్ ఇచ్చింది. ప్రభుత్వం హెచ్చరించకుండా ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేయడంతో వారికి కేసుల ట్రీట్ ఇచ్చింది. సోమవారం మధ్యాహ్నం వరకు ప్రైవేటు ట్రావెల్స్‌పై 300 కేసులు నమోదు చేసినట్లు పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి వస్తున్న క్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారని, ఇదే మంచి ఛాన్స్ అనుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు రేట్లను ఆకాశానికెత్తేశాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ బస్సు ఛార్జీల అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రావాణా శాఖ మంత్రి హెచ్చరించారు. బస్సు ఛార్జీలను పెంచితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణికుల నంచి సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలన్నారు. కానీ మంత్రి చేసిన హెచ్చరికలను ప్రైవేటు ట్రావెల్స్ వారు తుంగలో తొక్కేశారు. పండగ సమయంలో ఎవరు కంప్లెయింట్ చేస్తారన్న ధీమానో, ఎవరు పట్టుకుంటారులే అన్న ఇగోనో తెలియదుకానీ ప్రయాణికుల నుంచి రెండు మూడు రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటువంటి జరుగాయని పసిగట్టడంతోనే నాలుగు రోజులుగా పోలీసులు నగరంలో బస్సుల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ తదిర ప్రాంతాల్లో 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఆరాంఘర్ వద్ద తనిఖీల సందర్బంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై 300కు పైగా కేసు చేసినట్లు రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఇష్టమొచ్చినట్లు టికెట్ ఛార్జీలు పెంచారని తెలియడంతోనే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మంత్రి ఏమన్నారంటే

ప్రయాణికుల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించొద్దని వివరించారు. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కల్పించినా ఏమాత్రం సహించేది లేదని, వెంటనే సదరు ప్రైవేటు బస్సును సీజ్ చేస్తామని చెప్పారు. అదే విధంగా పండగ సమయం కదా ఛార్జీలను పెంచేద్దాం అన్న ఆలోచనలో ఉంటే వెంటనే విరమించుకోవాలని, ఛార్జీల పేరిట దోపిటీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ప్రయాణికుడి దగ్గర నుంచి రెగ్యులర్ ఛార్జీలనే వసూలు చేయాలని ప్రకటించారు. ‘‘ఏ ప్రైవేటు బస్సు అయినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే సదరు అంశాన్ని ప్రయాణికులు వెంటనే రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఆర్టీసీ అధికారులు రహదారులపైనే ఉండి తనిఖీలు చేపట్టాలి. సంక్రాంతి పండగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అవసరం అనుకుంటే ఈ ప్రత్యేక బస్సుల సంఖ్యను మరింత పెచుతాం’’ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Tags:    

Similar News