సిగాచి బ్లాస్ట్ మృతుల సంఖ్య 42

గాయపడిన వారిలో మరొక 11 మంది పరిస్థితి విషమం;

Update: 2025-07-01 03:37 GMT

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని  ఔషధ తయారీ సంస్థ సిగాచీ కెమికల్స్ జరిగిన  పేలుడు ఘటనలో  37 మంది కార్మికులు మృతి చెందారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ధృవీకరించారు. రాత్రి పొద్దుపోయాక కలెక్టర్ కార్యాలయం ఒక ప్రటకన విడుదల చేసింది.

నిన్నటి ప్రమాదం తర్వాత  చాలా మంది ఆచూకి లేకుండా పోయింది. వారిలో ఇపుడు చాలా మంది చనిపోయారని తేలింది. ఇపుడు  ఈ కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో గాయపడినవారిలో ఎక్కువ మంది బీహార్‌, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వారు. తెలంగాణ చరిత్రలోనే ఇది ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు.

నిన్న ఉదయం బ్లాస్ట్ జరిగినపుడు యూనిట్లో వంద మందికి పైగా పనిచేస్తున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పలు ఆస్పత్రుల్లో 35 మంది కార్మికులకి చికిత్స పొందుతున్నారు.ఘటనాస్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్, హెడ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కలెక్టర్ ప్రకటన

 సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి, జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీసు బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రమాదం మీద కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

" ప్రమాదం జరిగాక 57 మంది కార్మికులు పూర్తి సురక్షితంగా ఇంటికి వెళ్లారు.  ప్రస్తుతం 35 మంది కార్మికులకు పలు ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. 9 మంది ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 7 గురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఐసియు లో ఉన్న వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందుతున్నాయి.  47 మంది కార్మికులు ఆచూకి తెలియడం లేదు. ఇప్పటివరకు 26 మృతదేహాలు కనపించాయి. అందులో నాలుగు మృతదేహాలు గుర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతన్న వారిని పరామర్శిస్తారు.ప్రమాదం కారణం కనుక్కునేందుకు విచారణ జరుగుతూ ఉంది,’ అని కలెక్టర్ ప్రావీణ్య ప్రకటనలో  చెప్పారు.

Tags:    

Similar News