ఆపరేషన్ ‘సిందూర్’ షురూ.. LIVE

పాకిస్థాన్, పీఓకే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిభిరాలపై భారత భద్రతా బలగాలు మెరుపు దాడులు చేశాయి.;

Update: 2025-05-07 03:21 GMT

భారత భద్రతా బలగాలు ఈరోజు తెల్లవారుజామున ఆపరేషన్ ‘సంధూర్’ చేపట్టాయి. పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యలు స్టార్ట్ చేసింది భారత్. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పీఓకే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిభిరాలపై భారత భద్రతా బలగాలు మెరుపు దాడులు చేశాయి. ‘పాకిస్థాన్ మిలటరీ స్థావరాలను ఒక్కదాన్ని కూడా టార్గెట్ చేయలేదు. అన్నీ ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశాం’ అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారత్ దాడి చేసిన స్థావరాలు లష్కరే-ఇ-తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాయిద్దీన్ సహా పలు ఏజెన్సీలకు చెందినవని సమాచారం.

పూంచ్ మరియు రాజౌరిలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న గ్రామాలపై పాకిస్తాన్ సైన్యం భారీ మోర్టార్ షెల్లింగ్‌కు దిగింది. పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్ మరియు మంకోట్, రాజౌరి జిల్లాలోని లామ్, మంజాకోట్ మరియు గంబీర్ బ్రాహ్మణాల నుండి షెల్లింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. "పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై కేంద్రీకృత దాడులు జరిగాయి. ఇవి సరిహద్దు ఉగ్రవాద ప్రణాళిక మూలాలను లక్ష్యంగా చేసుకున్నాయి" అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సోషల్ మీడియా ఎక్స్ (X) లో తెలిపారు.

పాకిస్తాన్ సైన్యం పూంచ్, రాజౌరిలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న గ్రామాల వెంబడి పెద్దఎత్తున ఆయుధాలతో మోహరించి ఉన్నట్టు సమాచారం. రాజౌరి జిల్లాలోని పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్, మంకోట్, లామ్, మంజాకోట్, గంబీర్ బ్రాహ్మణ నుండి బాంబు దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని విమాన రవాణా సర్వీసులను నిలిపివేశారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం (మే 6, 2025) పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి సన్నాహాలను సమీక్షించారు. వీటిలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లపై మాక్ డ్రిల్‌లు నిర్వహించడం, "శత్రు దాడి" జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌరులకు శిక్షణ ఇవ్వడం, బంకర్‌లు, కందకాలను శుభ్రపరచడం వంటివి ఉన్నాయి.

ఇంతలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చర్చించింది. ఇక్కడ రాయబారులు ఉద్రిక్తతలను తగ్గించడానికి పిలుపునిచ్చారు.

Live Updates
2025-05-07 08:23 GMT

సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్

ఆపరేషన్ సింధూర్ ను ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారు

ప్రతి భారతీయుడు ఆర్మీకి బాసటగా నిలువాలి

సీఎం గా నాబాధ్యత నిర్వర్తిస్తున్న

రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా ఉండాల్సిన సమయం

రాజకీయాలు కాదు దేశం ముందు

భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం

అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం

2025-05-07 06:43 GMT

పహల్గామ్ బాధితులకు న్యాయం చేకూర్చడానికే ఆపరేషన్ సిందూర్: వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్

‘ఆపరేషన్ సిందూర్‌ను పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేకూర్చడం కోసమే లాంచ్ చేశాం. ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ దాడులు తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంప్‌లు టార్గెట్‌గా జరిగాయి. వాటిని విజయవంతంగా ధ్వంసం చేశాం’ అని ఆయన చెప్పారు.

2025-05-07 05:14 GMT

భారతదేశం చేసిన దాడులు ఉద్రిక్తత కలిగించనివి, బాధ్యతాయుతమైనవి: మిస్రి

2025-05-07 04:15 GMT

భారత్ చేపట్టిన ప్రతీకార దాడులపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. భద్రతా బలగాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆపరేషన్ సింధూర్ వెనుక మన సాయుధ దళాల అసాధారణ ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. వారి వీరోచిత చర్య భారతదేశం ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని పునరుద్ఘాటిస్తుంది.

పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన దాడి అమాయకుల జీవితాలపై మాత్రమే కాదు, ఇది భారతదేశ కలలు మరియు స్ఫూర్తిపై దాడి. మన ధైర్య సైనికుల ప్రతి ప్రయత్నం బాధితులకు, వారి కుటుంబాలకు మరియు శాంతి మరియు మానవత్వాన్ని విశ్వసించే ప్రతి భారతీయుడికి న్యాయం చేయడానికి ప్రతిజ్ఞ’’ అని ఆయన పేర్కొన్నారు.

మన దళాలతో అచంచల సంఘీభావం వ్యక్తం చేయడంలో కర్ణాటక దేశంతో కలిసి ఉంది. మీ శౌర్యం, త్యాగం మరియు మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మేము గర్విస్తున్నాము.

మన భూమిలో ఉగ్రవాదానికి స్థానం లేదు. భారతదేశం బలం మరియు ఐక్యతతో ప్రతిస్పందిస్తుంది.

2025-05-07 04:09 GMT

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దాడులు సరిహద్దు ఉద్రిక్తతలను పెంచిన తర్వాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 31 పైసలు తగ్గి 84.66కి చేరుకుంది.

2025-05-07 04:04 GMT

భారత్ చేపట్టిన ప్రతీకార దాడులపై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందన్నారు. భారత ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లోని స్థానికులూ భారత ఆర్మీకి జిందాబాద్‌లు కొడుతూ ‘భారత మాతాకీ జై’’ అంటూ నినదించారు.

2025-05-07 03:47 GMT

‘ఉగ్రవాద లక్ష్యాలపై పక్కా ప్రణాలికతో ఖచ్చితమైన దాడులు చేశారు. గత వారం నేను ఎలా అయితే చెప్పానో.. అదే విధంగా భద్రతా బలగాలు పర్ఫెక్ట్ టార్గెట్‌ను పక్కా కాలుక్యులేషన్‌తో కొట్టింది.

తీవ్రంగా కొట్టండి, తెలివిగా కొట్టండి. నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మా సాయుధ దళాలకు అండగా నిలుస్తాను. అదే సమయంలో సంఘర్షణ మరింత విస్తరించడాన్ని సమర్థించని విధంగా మేము ప్రవర్తించాము. మేము మా అభిప్రాయాన్ని చెప్పాము మరియు ఆత్మరక్షణ కోసం వ్యవహరించాము. అనియంత్రిత తీవ్రతను నివారించడానికి సంబంధిత వారందరూ తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఇది’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.


2025-05-07 03:40 GMT

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భారత ఆర్మీకి మద్దతుగా తమిళనాడు నిలుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు.

2025-05-07 03:38 GMT

భారత్ మెరుపు దాడుదలపై పళనిస్వామి స్పందించారు. న్యాయం అందిందంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ప్రతిస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ఏముందుంటే.. ‘‘పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్‌ను ఖచ్చితంగా అమలు చేసినందుకు భారత సాయుధ దళాలను నేను అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో న్యాయం జరిగింది. ఈ నిర్ణయాత్మక చర్య ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో, మన పౌరులను రక్షించడంలో మన దేశం యొక్క అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది’’ అని ఆయన రాసుకొచ్చారు.

2025-05-07 03:35 GMT

ఆపరేషన్‌లో భాగంగా ఇండియా టార్గెట్ చేసిన 9 ప్రాంతాలివే:

1. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్

2. మర్కజ్ తైబా, మురిద్కే

3. సర్జల్ / టెహ్రా కలాన్

4. మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్‌కోట్,

5. మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భింబర్

6. మర్కజ్ అబ్బాస్, కోట్లి,

7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి జిల్లాలో ఉంది,

8.ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యామ్

9. మర్కజ్ సయ్యద్నా బిలాల్

Tags:    

Similar News