తెలంగాణ చేరుకుంటున్న వివిధ దేశాల ప్రతినిధులు..

సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, దాదాపు 2,000 మంది దేశ–విదేశీ అతిథులు హాజరుకానున్నారు.

Update: 2025-12-08 07:15 GMT

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్రానికి పెట్టబడులు, పరిశ్రమలను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతునన ఈ సదస్సుకు పలు దేశాలకు సంబంధించి ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పలు దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు అందించింది. డిసెంబర్ 8,9 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు హాజరుకావడానికి ఇప్పటికే పలు దేశాల ప్రతినిధుల బృందాలు, పారిశ్రామిక వేత్తల బృందాలు తెలంగాణ ఫ్యూచర్ సిటీకి చేరకుంటున్నాయి.

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆరంభం కానుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సమిట్‌ను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించనున్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అలాగే దాదాపు 2,000 మంది దేశ–విదేశీ అతిథులు హాజరుకానున్నారు. ఇందుకు అనుగుణంగా సమిట్‌ ప్రాంగణం, అతిథుల బస ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. హోటళ్ల వద్ద భారీ బందోబస్తు, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ప్రత్యేక లైజనింగ్‌ అధికారులు, వీవీఐపీలకు డీఎస్పీ ర్యాంకు అధికారుల భద్రత వంటి ఏర్పాట్లు చేపట్టారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమిట్‌లో ప్రసంగించనున్నారు. ఆయన తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, ‘విజన్‌ 2047’ లక్ష్యాలు, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికలపై వివరించనున్నట్లు అధికారులు తెలిపారు. సమిట్‌లో పాల్గొనే వీవీఐపీ అతిథులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక యాక్సెస్ పాస్‌లు ఇచ్చారు. ప్రధాన హాలులో 2,000 మంది కూర్చునేలా సదుపాయాలు కల్పించారు. అలాగే, శాఖలవారీగా విదేశీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడానికి ప్రత్యేక మీటింగ్ హాల్స్‌ను సిద్ధం చేశారు. వీటి అనంతరం పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఈ గ్లోబల్‌ సమిట్‌కు పరిశ్రమలతో పాటు సినీ, క్రీడా, విద్య రంగాల ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ఇది మరొక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Live Updates
2025-12-08 08:55 GMT

‘‘యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేశారు.. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారు.. మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం కల్పించారు.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు’’ అని నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు.

2025-12-08 08:49 GMT


తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించి ప్రసంగించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు.

2047 నాటికి తెలంగాణ మూడ్‌ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని తన ఆకాంక్ష వ్యక్తం చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ సమ్మిట్‌ ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందన్నారు.

2025-12-08 08:38 GMT

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ కార్యక్రమంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ రంగాలకు చెందిన దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొన్నారు.

2025-12-08 08:33 GMT

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ్ ప్రసంగం ప్రారంభం

2025-12-08 07:55 GMT

ఫ్యూచర్ సిటీకి చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

2025-12-08 07:53 GMT

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

2025-12-08 07:48 GMT

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ప్రముఖ నటి, హీరోయిన్ అదితిరావు హైదరీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో “భారత్ ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, 2025 భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఆవిష్కరణ, పెట్టుబడి ప్రదర్శనలలో ఒకటిగా చెప్పబడింది…. భవిష్యత్తుకు స్వాగతం, తెలంగాణకు స్వాగతం” అని హీరోయిన్ అదితిరావ్ హైదరీ తెలిపారు.

2025-12-08 07:45 GMT

తెలంగాణ నుండి క్రీడలను అత్యున్నత స్థాయి ప్రతిభకు పెంచడం, సమాజం మూలాలున్న అథ్లెటిక్స్‌ను బలోపేతం చేయడం, భారతదేశ క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాదిని నిర్మించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్వీకరించినందుకు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, ఫుట్‌బాల్ ఐకాన్ బైచుంగ్ భూటియా ప్రశంసించారు.

2025-12-08 07:38 GMT

సంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మంత్రులతో కలిసి ఎనిమిది ప్రాంగణాలను కలియతిరిగారు. అక్కడ చేసిన అన్ని ఏర్పాట్లను పరిశీలించారు.

Tags:    

Similar News