ఫిరాయింపు నేతల అంశంపై విచారణ షెడ్యూల్ ఇదే..
మూడు రోజులు కొనసాగనున్న విచారణ.
ఫిరాయింపు నేతల అంశంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. ఈ విచారణ మూడు రోజుల పాటు జరగనుంది. 29వ తేదీన విచారణ ప్రారంభం కానుంది. ఆరోజున పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల తరుపు అడ్వకేట్లతో వాదనలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఒంటిగంటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ జరగనుంది. స్పీకర్/చైర్మన్ ఆధ్వర్యంలో 10 షెడ్యూల్ ప్రకారం విచారణ జరపనున్నారు.
బీఆర్ఎస్ అడ్వకేట్స్ వర్సెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లు..
• కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ T. ప్రకాశ్ గౌడ్
• చింత ప్రభాకర్ వర్సెస్ కేల యాదయ్య
• చింత ప్రభాకర్ వర్సెస్ గుడెం మహిపాల్ రెడ్డి
• పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
అయితే పార్టీ ఫిరాయింపుల అంశాలపై బీఆర్ఎస్ మొదటి నుంచి పట్టువదలకుండా ముందుకు వెళ్తోంది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ వేసి వాదనలు వినిపించింది. అందుకు ప్రతిఫలంగా ఫిరాయింపుల అంశంపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వాటిపైనే విచారణకు ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ చర్యలు చేపట్టారు.