పులిని దత్తత తీసుకున్న ఉపాసన

కుమార్తె క్లీంకార పేరే ఆడపులికి కూడా పెట్టిన ఉపాసన;

Update: 2025-06-20 09:45 GMT
జూపార్కుల డైరెక్టర్ సునీల్ హీరేమత్ కు క్లీంకార ఆడపులి దత్తత కింద చెక్కు అందజేస్తున్న ఉపాసన

చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె కొణిదెల క్లీంకార రెండో పుట్టినరోజు వేడుకలు శుక్రవారం (జూన్ 20) హైదరాబాద్ నగరంలో వేడుకగా జరిగాయి. కొణిదెల క్లీంకార రెండో జన్మదినం సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన తన గారాలపట్టీ పేరిట హైదరాబాద్ నెహ్రూ జంతుప్రదర్శన శాలలోని ఏడాది వయసున్న తెల్లరంగు ఆడపులిని దత్తత తీసుకున్నారు.




 జూ డైరెక్టరుకు రూ.3లక్షల చెక్కు అందజేత

హైదరాబాద్ జూపార్క్ లోని తెల్లరంగు ఆడపులికి క్లీంకార అని ఉపాసన పేరు పెట్టారు. తన కుమార్తె క్లీంకారను తీసుకొని ఉపాసన నెహ్రూ జూపార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఏడాది పాటు క్లీంకార తెల్ల ఆడపులి ఆహారం కోసం రూ. 3 లక్షల చెక్కును ఉపాసన తెలంగాణ జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్ హీరేమత్ కు అందజేశారు.



 జాపార్కులో ఉపాసన క్లీంకారతో సందర్శన

హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో ఉపాసన తన కుమార్తె క్లీంకారను తీసుకొని తాను తన కూతురి పేరిట దత్తత తీసుకున్న ఆడపులిని చూశారు. అనంతరం జూపార్కులోని ఏనుగులను తల్లీ కూతుళ్లు తిలకించారు.

జంతువులను జాగ్రత్తగా చూడాలి 
‘‘ హైదరాబాద్ లో ఒక సంవత్సరం క్రితం కేవలం ఒక చిన్న పులి.ఈ రోజు, ఆమె మా కుమార్తె పేరు మీద క్లింకారా అనే ఉల్లాసభరితమైన పులి.ఈ అందమైన సంజ్ఞకు ధన్యవాదాలువన్యప్రాణులు అడవిలోనే ఉన్నాయని మేం నమ్ముతున్నాం, కానీ జంతువులను గౌరవంగా, జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాం’’ అని ఉపాసన ఇన్ స్టాగ్రాంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News