ఛత్తీస్‌గఢ్‌ లో రైలు ప్రమాదం, 8 మంది మృతి

మెమ్యూ ప్యాసింజర్ , గూడ్స్ రైలు ఢీ

Update: 2025-11-04 16:25 GMT

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ రైల్వే స్టేషన్ సమీపాన జరిగిన ఒక  రైలు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మెమ్యూ (MEMU (mainline electric multiple unit) ప్యాసింజర్‌ రైలు, గూడ్స్‌ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో  ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం 4 గంటలపుడు జరిగింది.  గేవ్రా నుంచి బిలాస్​పుర్​ వైపు వెళ్తున్న మెమ్యూ ప్యాసింజర్ రైలు, గూడ్స్​ ట్రైన్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. గటోరా, బిలాస్ పూర్ స్టేషన్ల మధ్య  ఈ ప్రమాదం జరిగింది. 214680 ఫలితంగా ప్యాసింజర్ రైలు ముందు భాగం గూడ్స్​ ట్రైన్​పైకి ఎక్కింది. ఒక బోగీ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో 8 మంది చనిపోయారు, మరొక ఇద్దరు ఇంకా బోగీలో చిక్కుకున్నారు. మరొక 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాని తెలిసింది.


Tags:    

Similar News