‘జీ రామ్ జీ’ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక భారం తప్పదా?

ఉపాధి హక్కు నుంచి కేంద్రం వైదొలుగుతోందన్న ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్

Update: 2025-12-17 06:50 GMT

దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉపాధికి రెండు దశాబ్ధాలుగా కేంద్రంగా ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీ పథకం ఇక నుంచి గతం కానుంది. ఈ పథకం స్థానంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘జీ రామ్ జీ’ పథకాన్ని లోక్ సభలో ప్రవేశపెట్టింది.

ఇది తాజాగా దేశంలో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ఇది నిధుల కేటాయింపు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఉపాధి వంటి అంశాలపై చర్చను లేవదీసింది. 

Full View


ఈ అంశానికి సంబంధించి ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ‘ఎస్. శ్రీనివాసన్’ ‘‘టాకింగ్ విత్ శ్రీని’’ లో తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రతిపాదిత కొత్త చట్టంలో నిధుల బదిలీకి సంబంధించి కీలక ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

కొత్త చట్టం ప్రకారం ఈ పథకానికి కేంద్రం నుంచి కేవలం 60 శాతం నిధులు వేతనాల రూపంలో అందుతాయి. మిగిలిన 40 శాతం రాష్ట్రాలు భరించాల్సిందే. మెటీరియల్ ఖర్చుతో పాటు పరిపాలన ఖర్చులు రాష్ట్రాలు తమ ఖాతా నుంచి తీయాలి.

ఇంతకుముందు ఉపాధి హమీ పథకంలో 100 శాతం కేంద్రమే భరించేది. ఇది కేవలం పని హమీ పథకం. కానీ ఇప్పుడు దీని రూపురేఖలను కేంద్రం మార్చివేయబోతోంది.

రాష్ట్రాలపై ఆర్థిక భారం..
అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర స్థాయి అంచనాలు, ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం ఇవి ఏడాదికి దాదాపు పదివేల కోట్ల వరకూ ఉండనున్నాయి.
ఎంజీఎన్ఆర్ఈజీ పథకం పై ఇప్పటికే ఆర్థిక కోతలు అమలు అవుతున్నాయి. గడిచిన సంవత్సరాల బడ్జెట్ లతో పోల్చుకుంటే 2024-25 బడ్జెట్ లో దాదాపు 20 శాతం కేంద్రం కోత విధించింది. అనేక రాష్ట్రాలకు చెల్లించాల్సిన వేతనాలు కూడా కేంద్రం పెండింగ్ లో పెట్టిందని శ్రీనివాసన్ వివరించారు.
మరో ముఖ్యమైన మార్పును కూడా శ్రీనివాసన్ గుర్తించారు. ఇంతకుముందు పనికావాలని డిమాండ్ రాసి దరఖాస్తు చేస్తే దాని ఆధారంగా పనులను గుర్తించి పని కల్పించేవారు. దానికి కేంద్రం డబ్బులను కేటాయించేది.
ఇప్పుడు అవన్నీ కుదరవు. సాధారణ పనులను మాత్రమే కేంద్రం గుర్తించి వాటికి డబ్బులు ఖర్చు చేస్తుంది. దీన్ని దాటి ఏదైన ఖర్చు చేస్తే ఆ మొత్తం రాష్ట్రాలే ఇకముందు భరించాల్సి ఉంటుంది. ఇది హక్కుల ఆధారిత స్వభావాన్ని విడిచిపెడుతుంది. రాష్ట్రాలు అమలు చేసే ఇతర కేంద్రీకరణ కార్యక్రమాల స్థాయికి మారుతుంది.
కొన్ని మార్పులు..
బిల్లు ప్రస్తుతం వందరోజుల పనులను 125 రోజులకు పెంచింది. కానీ ఇది ఆచరణాత్మకంగా సాధ్యమవుతుందా అని శ్రీనివాసన్ సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కేవలం 55 రోజుల పాటు మాత్రమే ఉపాధి లభించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనులను కూడా చాలా తక్కువ మంది మాత్రమే పూర్తి చేస్తున్నారని ఆయన గుర్తించారు. నిధుల సమర్థ వినియోగం, జాప్యాలను పరిష్కరించకుండా హమీ ఇచ్చే రోజుల సంఖ్యను పెంచడం వలన ఇది కేవలం అలంకార ప్రాయంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ పనుల సీజన్ లో లో ఈ పథకం 60 రోజుల పాటు నిలిపివేయాలనే నిబంధనలను కూడా ఆయన ప్రస్తావించారు. వ్యవసాయంలో కార్మికుల కొరతను తీర్చడానికి దీనిని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నప్పటికీ, వ్యవసాయేతర రంగాల కూలీలను ఇది ప్రభావితం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది ఉపాధిని పరిమితం చేసే అవకాశం ఉందన్నారు. ఈ నిబంధన ప్రభావం వలసలకు గురయ్యే ప్రాంతాలలో అధికంగా కనిపిస్తుందని చెప్పారు.
రాజకీయ విమర్శలు..
కొత్త పథకం లోపాల గురించి కాకుండా పథకం పేరులో గాంధీ పేరును తొలగించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మహాత్మా గాంధీ వారసత్వాన్ని తొలగిస్తున్నాయని ఆరోపించాయి. ఈ మార్పులు తన దీర్ఘకాలిక అభివృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ నిరుద్యోగం తగ్గుతుంటే.. అతిపెద్ద గ్రామీణ ఉపాధి హమీ కార్యక్రమం తిరిగి రూపొందించడం వల్ల స్థూల ఆర్థిక వాదనలు, క్షేత్ర స్థాయి వాస్తవాల మధ్య అంతరం గురించి లోతైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని శ్రీనివాసన్ అన్నారు.


Tags:    

Similar News