'రంగులు మార్చుకుంటున్న నక్సలిజం ప్రమాదకరం....'
‘వామపక్ష భావాలున్న మేధావులు హరగోపాల్, ఆకునూరి మురళి, కోదండరాంలు సాయుధ ఉద్యమం సరైనది కాదని చెప్పాలి.’;
భారత దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత హింసావాదానికి తావులేదని మాజీ ఐఎఎస్ అధికారి లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.అయితే, పిల్లలకు , యువకులకు దేశంలో అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అలా కాని పక్షంలో వాళ్ల గుండెల్లో కసి ఉంటుందన్న విషయం విస్మరించరాదని కూడా ఆయన అన్నారు.
అమరవీరుల స్మారక పరిశోధన సంస్థ (MMRI) ఆధ్వర్యంలో ‘ మారుతున్న నక్సలిజం రంగు' (Changing Colours of Naxalism) అనే అంశం పై ఉస్మానియా యూనివర్శిటీ ఆడిటోరియంలో శనివారం జరిగిన సెమినార్’ లో జయప్రకాశ్ నారాయణ్ అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎమ్ ఎమ్ ఆర్ ఐ అనేది రాష్ట్రీయ స్వయం సేవకర్ సంఘ్ (RSS) సీనియర్ నేతలు 1991లో ఏర్పాటు చేసిన సంస్థ. నక్సలైట్ చేతిలోచనిపోయిన వారిని స్మరించుకుంటూ దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడటం తన ఉద్దేశంగా ఈ సంస్థ ప్రకటించుకుంది. నక్సలిజం అనేది ఇపుడు రంగు మార్చుకుందని, అది ఇపుడు యూనివర్శిటీలలో,మీడియాలో, స్వచ్ఛంద సంస్థలలో, న్యాయ పోరాటాలలో ‘అర్బన్ నక్సలైట్స్’గా ఉనికిని మార్చుకుందని ఈ సంస్థ అభిప్రాయపడుతున్నది. కేవలం తుపాకి గొట్టం మీద అధారపడకుండా, సోషల్ మీడియా ప్లాట్ ఫారాల నుంచి సైబర్ ప్రాపగాండ బోగస్ కథనాలు సృష్టించి తద్వార యువకులను ఉత్తేజపరిచి నక్సలిజం వైపు మళ్లించేందుకు అర్బన్ నక్సలైట్లు పనిచేస్తున్నారని అంటూ వారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరాన్ని ఎం ఎం ఆర్ ఐ నొక్కిచెబుతున్నది. మేధావులు, మానవ హక్కుల ఉద్యమకారుల పేరుతో చలామణి అవుతున్న ఈ అర్బన్ నక్సల్స్ ను ఎదుర్కోవడం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ మారిందని ఎంఎంఆర్ చెబుతున్నది. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని రూపమాపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్నప్రయత్నాలకు ఊతంగా ఎంఎంఆర్ఐ నేడు హైదరాబాద్ లో ఈ ‘మారుతున్న నక్సలిజం రంగు’ సెమినార్ ని ఏర్పాటు చేసింది.
అపార వైవిధ్యం ఉన్న భారతదేశంలో ఐక్యత లేకుండా శాంతిభద్రతల పరిరక్షణ, స్వేచ్ఛ సాధ్యమవుతుందా అని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. సమానత్వం, సోషలిజం, వామపక్షభావాలతో మనమంతా ప్రభావితమైన వారమే నంటూ దేశ సార్వ భౌమత్వానికి, సమాజ సుస్ధిరతకు భంగం వాటిల్లినపుడు చట్టపరిధిలో పనిచేయాలన్నారు. యుగోస్లోవియా, సోవియెట్ యూనియన్ దేశాల్లో జరిగిన అనైక్యత ఆ దేశాలను విచ్ఛిన్నం చేసిందని జేపీ చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో ఏడేళ్లపాటు పనిచేశా...
నాగాలాండ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్ , మాజీ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ నక్సలిజంలో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ అని ఉన్నారని, సాఫ్ట్ వేర్ వారే అర్బన్ నక్సలైట్లు అని చెప్పారు. తీవ్రవాద టెండెన్సీని రూపుమాపాలని సూచిస్తూ కళాశాలల్లో లెఫ్ట్ వింగ్ అధ్యాపకులున్నారని, వారే నక్సలిజం మాటలు రంగులు మార్చుకున్నారని చెప్పారు.
ఎస్ ఆర్ శంకరన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నపుడు ఆయవ వద్దకు వెళ్లినపుడు గిరిజన ప్రాంతాల్లో ఎవరు పనిచేస్తారని అడిగితే తానే చేయి ఎత్తానని మరునాడే ఆసిఫాబాద్ సబ్ కలెక్టరుగా, ఉట్నూరు, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశానని ఆయన చెప్పారు. తాను ఏడేళ్ల పాటు గిరిజన ప్రాంతాల్లో పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.
నక్సలైట్లను, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిని, సాయుధ దళాలను గుర్తు పెట్టుకుంటున్నామని , కానీ వీరి మధ్య నలిగిన గిరిజనుల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
ఏ గిరిజనుడు కూడా చేయి చాపి యాచించరని చెప్పారు. ఇన్ ఫార్మర్ల నెపంతో ఎందరో గిరిజనులను నక్సలైట్లు కాల్చి చంపారని ఆయన ఆరోపించారు. తాను కరీంనగర్ లో పనిచేసినపుడు వెంకట్రావు అనే ఎమ్మెల్యే ప్రజలకు దగ్గరగా ఉన్నారని, అతన్ని కాల్చిచంపారని ఆరోపించారు. ప్రజలకు దగ్గరగా ఉండే శ్రీపాదరావును కూడా నక్సలైట్లు కాల్చి చంపారని చెప్పారు. నక్సలైట్లు ఆపరేట్ చేసే ప్రాంతాల్లో తిరుగుతున్నారని ప్రజలకు దగ్గరయ్యే నేతలను వారు చంపారని చెప్పారు.
తుపాకీ గొట్టం ద్వారా తాము రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పడం సరైంది కాదని ఉమ్మడి ఆంధ్రప్రదశ్ మాజీ డీజీపీ, ఐపీఎస్ కె అరవింద్ రావు చెప్పారు చెప్పారు. అంబుజ్ మడ్ దట్టమైన అడవి అని, అక్కడ మావోయిస్టులు కేంద్రంగా చేసుకొని పాగా వేశారని హింసాకాండకు పాల్పడుతున్నారని చెబుతూ మావోయిస్టుల సమస్య శాంతి భద్రతల సమస్య కాదని, ఇది దేశ అంతర్గత సమస్య అని అంటూ తాము అనేక నివేదికలు పంపించి కేంద్రాన్ని ఈవిషయంలో ఒప్పించగలిగామని చెప్పారు.
మారుతున్న నక్సలిజం రంగులు చూశాను...
ప్రొఫెసర్ కెఎస్ చలం ఉత్తరాంధ్ర ‘వలస’ జీవితాల మీద రాసిన నాటకం