ప్రపంచ సమస్యలకు సత్యం, అహింసా మాత్రమే పరిష్కారం: ప్రధాని మోదీ

ప్రపంచంలో జీవించి ఉన్న పురాతన నాగరికత భారత్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మానవాళికి సురక్షితమైన ఆశ్రయం ఇచ్చింది కూడా భారతే అని గుర్తు చేశారు.

Update: 2024-04-21 10:30 GMT

ప్రపంచ సమస్యలకు సత్యం, అహింసా మాత్రమే పరిష్కారం చూపుతాయని, భారత దేశం వాటిని ఆచరించి చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త తరం ఆత్మగౌరవమే తన గుర్తింపుగా నమ్మిందని అన్నారు. వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీలో జరిగిన భగవాన్ మహావీర్ 2,550వ నిర్వాణ్ మహోత్సవ్‌లో మోదీ ప్రసంగించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు తమ ప్రభుత్వం వారసత్వ సంపదతోపాటు భౌతికాభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. గత యూపీఏ హయాంలో దేశాన్ని దేశంలో నిరాశ నెలకొందని, అవినీతి ఏరులైపారిందన్నారు.
శాంతికి మార్గం
యోగా - ఆయుర్వేదం వంటి భారతీయ వారసత్వాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మోదీ ఉదహరించారు. దేశం బలం పెరుగుతున్న కొద్ది, దానిపై విదేశాంగ విధానం ఆధారపడి శాంతికి మార్గాలు వేస్తోందని అన్నారు. ప్రపంచం ఇప్పుడు శాంతి కోసం భారత్ వైపు చూస్తుందని చెప్పారు.
శాంతి ప్రక్రియలో భారతదేశ సాంస్కృతిక వారసత్వం కూడా పెద్ద పాత్ర పోషించిందని మోదీ అన్నారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల సమయంలో, తీర్థంకరుల బోధనలు మరింత సందర్భోచితంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. "భగవాన్ మహావీర్ శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం సందేశం ప్రతి ఒక్కరికీ గొప్ప ప్రేరణ" గా నిలిచాయని అని ప్రధాన మంత్రి కొనియాడారు.
ప్రజాస్వామ్య పండుగ
ప్రజాస్వామ్యంలో పెద్ద పండుగ జరుగుతోందని, లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ అన్నారు. "ఇక్కడి నుంచి భవిష్యత్తులోకి కొత్త ప్రయాణం కూడా ప్రారంభమవుతుందని దేశం విశ్వసిస్తోందని" చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన వారు ఉదయాన్నే తమ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అమృత్ కాల్
మహోత్సవ్ అరుదైన సందర్భమని, ఇది అమృత్‌కాల్‌ ప్రారంభంలో జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర శతాబ్ది సంవత్సరాన్ని "గోల్డెన్ శతాబ్ది"గా మార్చేందుకు దేశం కృషి చేస్తోందని మోదీ అన్నారు. "అమృత్ కాల్" ఆలోచన కేవలం ఒక సంకల్పం కాదు, దేశపు ఆధ్యాత్మిక ప్రేరణ అని ఆయన చెప్పారు. భారత్ జీవించి ఉన్న పురాతన నాగరికత మాత్రమే కాదు, మానవాళికి సురక్షితమైన ఆశ్రయం కూడా అని ఆయన అన్నారు.


Tags:    

Similar News